Tamannaah | తనకన్న వయసులో చిన్న హీరోతో తమన్నా రొమాన్స్ – సన్నీలియోన్ హారర్ మూవీకి సీక్వెల్
బాలీవుడ్‌లో తమన్నా ఓ హారర్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సన్నీలియోన్ హారర్ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న రాగిణి ఎమ్ఎమ్ఎస్ 3లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సీక్వెల్‌లో ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో తమన్నా రొమాన్స్ చేయబోతుంది.
Entertainment | Published On Feb 13, 2026, 3.01 pm IST
Tamannaah | సాధారణంగా సినిమాల్లో హీరోల కంటే హీరోయిన్ల వయసు చాలా తక్కువగా ఉంటుంది. తమ వయసులో సగం కూడా లేని యంగ్ హీరోయిన్లతో సీనియర్ హీరోల రొమాన్స్‌పై చాలా సార్లు ట్రోల్స్, మీమ్స్ వస్తూనే ఉంటాయి. ఏజ్ గ్యాప్ విమర్శలను ఇప్పటికీ స్టార్స్ ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే అప్పుడప్పుడు సీన్ రివర్స్ అవుతుంటుంది. కుర్ర హీరోలతో సీనియర్ హీరోయిన్లు జోడీ కడుతుంటారు. ఓ బాలీవుడ్ హారర్ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా తనకంటే వయసులో చిన్నవాడైన హీరోతో జోడీకట్టబోతుంది.
రెండు బ్లాక్‌బస్టర్స్...
బాలీవుడ్‌లో రాగిణి ఎమ్ఎమ్ఎస్ ఫ్రాంచైజ్‌లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. రాగిణి ఎమ్ఎమ్ఎస్ పార్ట్ వన్‌లో రాజ్‌కుమార్ రావు, కైనాజ్ మోతీవాలా హీరోహీరోయిన్లుగా నటించారు. సీక్వెల్‌లో సన్నీలియోన్ కథానాయికగా కనిపించింది. బోల్డ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టాయి. తాజాగా రాగిణి ఎమ్ఎమ్ఎస్ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రాబోతుంది.
ఆమిర్ ఖాన్ కొడుకు...
రాగిణి ఎమ్ఎమ్ఎస్ 3ని శుక్రవారం మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. పార్ట్ 3లో తమన్నా హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రకటించారు. ఈ హారర్ మూవీలో హీరోగా ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కనిపించబోతున్నాడు.
కుర్ర హీరోతో...
హారర్ మూవీ కోసం కుర్ర హీరోతో తమన్నా రొమాన్స్ చేయబోతుండటం బాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. జునైద్ ఖాన్ కంటే తమన్నా నాలుగేళ్లు పెద్దది. తమన్నా వయసు 36 కాగా...జునైద్ ఖాన్ ఏజ్ 32 ఏళ్లే. వీరిద్దరి కాంబోలో సినిమాను అనౌన్స్‌చేయడం హాట్ టాపిక్‌గా మారింది. గత సినిమాలకు మించి రాగిణి ఎమ్ఎమ్ఎస్ పార్ట్ 3 మరింత బోల్డ్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. తమన్నా గ్లామర్ రోల్‌తో అదరగొట్టడం ఖాయమని అంటున్నారు.
డైరెక్టర్ ఎవరంటే...
రాగిణి ఎమ్ఎమ్ఎస్ 3 సినిమాకు శశాంక్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళంలో పురుషన్ అనే సినిమా చేస్తోంది తమన్నా. విశాల్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి సుందర్ సీ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో మొగుడు పేరుతో ఈ మూవీని డబ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tamannaah | తనకన్న వయసులో చిన్నవాడైన హీరోతో మిల్కీ బ్యూటీ రొమాన్స్
మే 9, 2026

Tamannaah Bhatia | తమన్నా రిస్క్ చేస్తోందా..? స్పెషల్ సాంగ్ కోసం కెరీర్‌నే పణంగా పెడుతోందా..?
మే 6, 2026

Sai Pallavi | సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ – తొలిరోజే థియేటర్లు ఖాళీ
మే 2, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



