త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ – ఐకానిక్ సాంగ్ కోసం స్టెప్పులు

బాలీవుడ్ క‌ల్ట్ క్లాసిక్ మూవీ ఖ‌ల్ నాయ‌క్‌కు సీక్వెల్ రాబోతుంది. ఖ‌ల్ నాయ‌క్ రిట‌ర్న్స్ పేరుతో ఈ సీక్వెల్‌ను ఇటీవ‌ల సంజ‌య్ ద‌త్ అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Apr 28, 2026, 1.01 pm IST

Tamannaah | బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ – ఐకానిక్ సాంగ్ కోసం స్టెప్పులు
Advertisement

Tamannaah |  సంజ‌య్ ద‌త్ హీరోగా సుభాష్ ఘాయ్ ద‌ర్శ‌క‌త్వంలో 1993లో రిలీజైన బాలీవుడ్ మూవీ ఖ‌ల్ నాయ‌క్ ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. హీరోగా సంజ‌య్ ద‌త్ కెరీర్‌ను మ‌లుపుతిప్పింది. హీరోగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో సంజ‌య్ ద‌త్ అద‌ర‌గొట్టారు.

మాధురీ దీక్షిత్ ....

ఈ సినిమాలోని చోలీ కే పీచే క్యా హై మూవీ అప్ప‌ట్లో యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. ఫోక్ స్టైల్‌లో ట్యూన్‌, మాధురీ దీక్షిత్ స్టెప్పులు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. 1990 ద‌శ‌కంలో బాలీవుడ్‌లో బెస్ట్ సాంగ్స్‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ పాట‌పై అదే స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌, బూతుల‌తో ఈ పాట నిండిపోయిందంటూ చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
తాజాగా చోలీ కే పీచే క్యాహై పాట‌ను మ‌రోసారి రీమిక్స్ చేయ‌బోతున్నారు. ఈ రీమిక్స్ సాంగ్ కోసం త‌మ‌న్నా స్టెప్పులు వేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఖ‌ల్ నాయ‌క్ రిట‌ర్న్స్‌...

ఖ‌ల్ నాయ‌క్ మూవీకి ఇటీవ‌లే సీక్వెల్‌ను అనౌన్స్‌చేశారు సంజ‌య్ ద‌త్‌. ఖ‌ల్ నాయ‌క్ రిట‌ర్న్స్ పేరుతో ఈ సీక్వెల్ తెర‌కెక్కుతోన్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమా కోసం చోళీకే పీ చే క్యా హై పాట‌ను రీమిక్స్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ స్పెష‌ల్ సాంగ్‌లో త‌మ‌న్నా క‌నిపించ‌బోతున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఐటెంసాంగ్ కోసం ఇప్ప‌టికే త‌మ‌న్నాను మేక‌ర్స్ అప్రోచ్ అయ్యార‌ట‌. త‌మ‌న్నా కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఒరిజిన‌ల్ సాంగ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అదిరిపోయే స్టెప్పుల‌తో రీమిక్స్ సాంగ్ ఉండ‌నుంద‌ట‌.

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌...

ఖ‌ల్ నాయ‌క్ రిట‌ర్న్స్ మూవీని సంజ‌య్ ద‌త్ స్వ‌యంగా నిర్మిస్తున్నారు. సుభాష్ ఘాయ్ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ సీక్వెల్ తెర‌కెక్కుతోంది. డైరెక్ట‌ర్‌తో పాటు ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల ఎంపిక పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే మ‌రో భారీ ఈవెంట్‌తో వారి వివ‌రాల‌ను రివీల్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement