Tamannaah | ఐపీఎస్ ఆఫీసర్ బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ – బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా కన్ఫామ్
బాలీవుడ్‌లో ఓ బయోపిక్‌కు మిల్కీ బ్యూటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా జీవితం ఆధారంగా స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఓ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. మారియా ఐపీఎస్ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Jun 23, 2026, 4.43 pm IST
Tamannaah | యంగ్ హీరోయిన్ల పోటీని తట్టుకుంటూ దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం ఆరు సినిమాలను లైన్‌లో పెట్టింది. తన అప్‌కమింగ్ మూవీస్ వివరాలను ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా రివీల్ చేసింది. అందులో రెండు బయోపిక్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పింది. లెజెండరీ ఫిల్మ్ మేకర్ వీ శాంతారం జీవిత కథతో రానున్న సినిమాలో తమన్నా హీరోయిన్‌గా కనిపించబోతున్నది. దీనితో పాటు మరో బయోపిక్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రకటించింది. ఈ సినిమా టైటిల్‌ను తమన్నా రివీల్ చేసింది.
పోలీస్ కమిషనర్...
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా జీవితం ఆధారంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఓ సినిమా తెరకెక్కిస్తోన్నాడు. ఈ బయోపిక్‌లో జాన్ అబ్రహం టైటిల్ పాత్రలో కనిపించబోతున్నాడు. రాకేష్ మారియా భార్య ప్రీతి మారియాగా తమన్నా కనిపించబోతున్నది. ఈ సినిమాకు మారియా ఐపీఎస్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తమన్నా చెప్పింది. 1993 ముంబై పేలుళ్ల కేసు, 26 11 ముంబై ఎటాక్స్ కేసుతో పాటు సంచలనం సృష్టించిన షీనా బోరా మర్డర్ కేసులను రాకేష్ మారియా ఇన్వేస్టిగేట్ చేశాడు. ఈ క్రైమ్ ఇన్వేస్టిగేషన్‌లో రాకేష్ మారియాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? మాఫియా నుంచి ఎలాంటి బెదిరింపులు వచ్చాయి? ప్రాణాలకు తెగించి టెర్రరిస్ట్‌లను ఎలా హతమార్చారనే అంశాలను చూపించబోతున్నారట.
రియలిస్టిక్...
క్రైమ్ అంశాలతో పాటు ఫ్యామిలీ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్ చేసి మారియా ఐపీఎస్ మూవీని రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్నారట. రాకేష్ మారియా, ప్రీతి మారియా మధ్య అనుబంధాన్ని ఎమోషనల్‌గా చూపించబోతున్నట్లు సమాచారం. ఈ బయోపిక్ కోసం రియల్ ప్రీతి మారియాను మిల్కీ బ్యూటీ తమన్నా కలిసిందట. పాత్ర తీర్చుతెన్నెలు, భర్తకు అండగా నిలిచే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సంఘర్షణ, సవాళ్లను కూడా తెలుసుకొన్నదట. అంతే కాకుండా తమన్నాపై సినిమాలో కొన్ని రిస్కీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రోహిత్ శెట్టి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నాలుగు సినిమాలు..
కాగా మారియా ఐపీఎస్‌తో పాటు హిందీలో రాగిణి 3, వీ శాంతారం సినిమాలు చేస్తున్నట్లు తమన్నా వెల్లడించింది. తమిళంలో విశాల్‌తో పురుషన్ సినిమా చేస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sukumar | ప్రియదర్శి ఇడుపు కాయిదం - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా
- ●Padma Awards 2026 | పద్మ పురస్కారాలు 2026: టాలీవుడ్ సీనియర్లకు 'పద్మశ్రీ'.. మమ్ముట్టి, అల్కా యాగ్నిక్లకు 'పద్మభూషణ్'
- ●Trisha | దళపతి విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష నిజంగా అన్‌ఫాలో చేసిందా? బ్రేకప్ నిజమేనా ? అసలు ట్విస్ట్ ఇదే!
- ●KTR | మరో భారీ కుంభకోణం.. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్ను : కేటీఆర్
- ●Chanagani Dayakar | బాహుబలిని ఓడించే సత్తా కేటీఆర్‌కు లేదు : చనగాని దయాకర్
- ●Hyderabad Metro Rail | కథ కంచికి.. మెట్రో మళ్లీ మొదటికి

Sukumar | ప్రియదర్శి ఇడుపు కాయిదం - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా

Padma Awards 2026 | పద్మ పురస్కారాలు 2026: టాలీవుడ్ సీనియర్లకు 'పద్మశ్రీ'.. మమ్ముట్టి, అల్కా యాగ్నిక్లకు 'పద్మభూషణ్'

Trisha | దళపతి విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష నిజంగా అన్‌ఫాలో చేసిందా? బ్రేకప్ నిజమేనా ? అసలు ట్విస్ట్ ఇదే!

KTR | మరో భారీ కుంభకోణం.. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్ను : కేటీఆర్






