Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ – నాలుగోసారి కాంబో రిపీట్
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 12 విడుదల పేరుతో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.
Entertainment | Published On Sep 3, 2026, 3.40 pm IST
Tamannaah | తెలుగులో అగ్ర హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో నటించే ట్రెండ్‌కు మిల్కీ బ్యూటీ తమన్నా శ్రీకారం చుట్టింది. ఆమె అడుగుజాడల్లోనే పూజా హెగ్డే, సమంతతో పాటు పలువురు నాయికలు అడుగులు వేశారు. అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశతో పాటు పలు సినిమాల్లో తమన్నా చేసిన ఐటెంసాంగ్స్ పెద్ద హిట్టయ్యాయి. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ స్పెషల్ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ కనిపించబోతుంది.
జనవరి 12 విడుదల...
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో జనవరి 12 విడుదల పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సంక్రాంతికి రిలీజ్...
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయ్యింది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తమన్నా స్పెషల్ సాంగ్...
జనవరి 12 విడుదలలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2, ఎఫ్ 3లో తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత అనిల్ రావిపూడి, మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరులో ప్రత్యేక గీతంలో కనిపించింది. తనకు వరుసగా బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడిపై గౌరవంతో మరోసారి అతడి సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి తమన్నా అంగీకరించినట్లు చెబుతోన్నారు. సెప్టెంబర్ నెలాఖరున వెంకటేష్, కళ్యాణ్ రామ్ తమన్నాలపై ఈ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ పాటలో అనిల్ రావిపూడి గెస్ట్‌గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తమన్నా చేస్తోన్న నాలుగో మూవీ ఇది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
సెప్టెంబర్ 4, 2026

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ – విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
సెప్టెంబర్ 4, 2026

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



