త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | హార‌ర్ మూవీ షూటింగ్‌లో భ‌య‌ప‌డ్డ మిల్కీ బ్యూటీ – ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌

హార‌ర్ మూవీ షూటింగ్‌లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భ‌య‌ప‌డింది. సెట్స్‌లో త‌న‌కు ఎదురైన విచిత్ర ప‌రిస్థితిని ఇన్‌స్టా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఆమె పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Aug 8, 2026, 5.39 pm IST

Tamannaah | హార‌ర్ మూవీ షూటింగ్‌లో భ‌య‌ప‌డ్డ మిల్కీ బ్యూటీ – ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌
Advertisement

Tamannaah  హార‌ర్ మూవీ షూటింగ్‌లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భ‌యంతో వ‌ణికిపోయింది. సెట్స్‌లో త‌న‌కు ఎదురైన అనూహ్య సంఘ‌ట‌న గురించి సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. బాలీవుడ్‌లో రాగిణి 3 పేరుతో ఓ హార‌ర్ మూవీ చేస్తోంది త‌మ‌న్నా. రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంఛైజ్‌లో మూడో పార్ట్‌గా రాబోతున్న ఈ సినిమాలో త‌మ‌న్నాతో పాటు జునైద్ ఖాన్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

పాత‌కాలం నాటి బంగ‌ళా...

రాగిణి ఎంఎంఎస్ షూటింగ్ ముంబైలోని పాత కాలం నాటి బంగ‌ళాలో జ‌రుగుతోంది. లిమిటెడ్ క్రూతో నైట్ షూట్స్ చేస్తున్నారు. నైట్ టైమ్‌లో హార‌ర్ సీన్స్‌ షూటింగ్ చేస్తోండ‌గా...ఒక్క‌సారిగా త‌మ‌న్నా ముందు ఓ న‌ల్ల‌పిల్లి హ‌ఠాత్తుగా జంప్ చేసింది. ఆ పిల్లిని చూడ‌టంతో నిజంగానే ద‌య్యం వ‌చ్చింద‌నుకొని భ‌యంతో ఒక్క‌సారిగా వ‌ణికిపోయిన త‌మ‌న్నా అరిచేసింది. ఆమె అరుపుల‌తో యూనిట్ స‌భ్యులు మొత్తం కంగారు ప‌డిన‌ట్లు స‌మాచారం. చివ‌ర‌కు అస‌లు విష‌యం తెలిసి అంతా న‌వ్వుకున్నార‌ట‌. ఈ సంఘ‌ట‌న‌ను వివ‌రిస్తూ త‌మ‌న్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఆమె ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

బోల్డ్ రోల్‌...

రాగిణి 3 మూవీలో త‌మ‌న్నా బోల్డ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎక్తా క‌పూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ‌శాంక ఘోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం రాగిణి 3తో పాటు హిందీలో మ‌రో నాలుగు సినిమాలు చేస్తోంది త‌మ‌న్నా. వీటిలో వాన్ మూవీ ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. మ‌రోవైపు త‌మిళంలో విశాల్ పురుష‌న్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ తెలుగులో మొగుడు పేరుతో రిలీజ్ కాబోతుంది.

 

Advertisement
Advertisement