త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | హీరోయిన్ల‌ను గ్లామ‌ర్ డాల్స్‌లా చూస్తారు – సౌత్ ఇండ‌స్ట్రీపై త‌మ‌న్నా కామెంట్లు

సౌత్ ఇండ‌స్ట్రీపై మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో పురుషాధిక్య‌త చాలా ఎక్కువ‌ని అన్న‌ది. హీరోయిన్లు అంటే కేవ‌లం గ్లామ‌ర్‌కే ప‌రిమితం అనే భావ‌న ఇక్క‌డ చాలా ఉంటుంద‌ని చెప్పింది. ఆమె కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Jul 25, 2026, 3.27 pm IST

Tamannaah | హీరోయిన్ల‌ను గ్లామ‌ర్ డాల్స్‌లా చూస్తారు – సౌత్ ఇండ‌స్ట్రీపై త‌మ‌న్నా కామెంట్లు
Advertisement

Tamannaah | మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ బాలీవుడ్ సినిమాల‌తో మొద‌లైంది. కానీ హిందీలో ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు, గుర్తింపు రాక‌పోవ‌డంతో టాలీవుడ్‌వైపు అడుగులు వేసింది. హ్యాపీడేస్ సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను అందుకున్న ఈ బ్యూటీ అతి త‌క్కువ టైమ్‌లోనే తెలుగులో టాప్ హీరోయిన్‌గా మారింది. ఈ ఫేమ్‌తో తిరిగి హిందీలోకి అడుగుపెట్టి అక్క‌డ కూడా స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఓ వైపు క‌థానాయిక‌గా సినిమాలు చేస్తూనే ప్ర‌త్యేక గీతాల్లో క‌నిపిస్తోంది.

హీరోయిన్లు..

ఇటీవ‌ల ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ‌న్నా ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. హీరోయిన్ల‌ను గౌర‌వించే తీరు, స్వేచ్ఛ విష‌యంలో సౌత్ ఇండ‌స్ట్రీతో పోలిస్తే బాలీవుడ్ ఎంతో మెరుగు అని అన్న‌ది. ప్ర‌త్యేక గీతాల‌ను ఐటెంసాంగ్స్ అని పిల‌వ‌డం త‌న‌కు ఇబ్బందిక‌రంగా అనిపిస్తుంద‌ని చెప్పింది.

పురుషాధిక్య‌త‌...

"తెలుగు, త‌మిళంతో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో పురుషాధిక్య‌త చాలా ఎక్కువ‌గా ఉంటుంది. హీరోల‌తో పోలిస్తే హీరోయిన్లచూసే తీరు, గౌర‌వించే విధానంలో చాలా తేడాలు ఉంటాయి. క‌థానాయిక అన‌గానే చుల‌క‌న భావం కొంత‌మందిలో క‌నిపిస్తుంది. అలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను తాను చాలా సార్లు ఎదుర్కొన్నాను. క‌థానాయిక‌ల‌ను కేవ‌లం గ్లామ‌ర్ కోస‌మే హీరోయిన్ల‌ను సినిమాల్లో తీసుకునే సంస్కృతి ఇప్ప‌టికీ సౌత్‌లో కొన‌సాగుతూనే ఉంది. వారిని ఓ గ్లామ‌ర్ డాల్స్‌లా మాత్ర‌మే చూస్తారు. అది తెలిసి కూడా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో నేను చాలా సినిమాలు అంగీక‌రించా" అని త‌మ‌న్నా అన్న‌ది.

స్వేచ్ఛ ఉంటుంది...

కానీ "బాలీవుడ్‌లో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తాయి. క‌థానాయిక‌ల‌ను గ్లామ‌ర్ పాత్ర‌లు చేయాలా? లేదంటే ప‌ర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాలు ఎంచుకోవాలా అనే స్వేచ్ఛ ఉంటుంది. త‌మ‌కు న‌చ్చిన‌ట్లుగా కెరీర్‌ను తీర్చ‌దిద్దుకునే అవ‌కాశం బాలీవుడ్‌లో ఉంది. ఆ ఫ్రీడ‌మ్ నాకు సౌత్ ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌లేదు"  అని త‌మ‌న్నా చెప్పింది.

ఆ పిలుపు న‌చ్చ‌దు...

ఐటెంసాంగ్స్‌పై కూడా త‌మ‌న్నా కామెంట్లు చేసింది. "ప్ర‌త్యేక గీతాల‌ను కొంద‌రు ద‌క్షిణాదిలో ఐటెంసాంగ్స్‌గా పిలుస్తుంటారు. అలా పిల‌వ‌డం నాకు న‌చ్చ‌దు. ఐటెంసాంగ్స్ అనే ప‌దం మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఉంటుంది. స్పెష‌ల్ సాంగ్స్‌ను కూడా న‌ట‌న‌లో ఓ భాగంగానే నేను భావిస్తా. వాటిని ప్ర‌త్యేకంగా చూడ‌టం నాకు న‌చ్చ‌దు"  అని పేర్కొన్నది. సౌత్ ఇండ‌స్ట్రీపై త‌మ‌న్నా చేసిన వ్యాఖ్య‌ల‌ను నెటిజ‌న్లు త‌ప్పుప‌డుతున్నారు. త‌మ‌న్నాకు పేరు, డ‌బ్బు, ఫేమ్ అన్ని సౌత్ ఇండ‌స్ట్రీనే తెచ్చిపెట్టింద‌ని, ఆ కృత‌జ్ఞ‌త లేకుండా కామెంట్లు చేయ‌డం స‌రికాదంటూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement
Advertisement