Tamannaah | హనుమాన్ డైరెక్టర్‌తో తమన్నా తెలుగు కామెడీ డ్రామా మూవీ – నేరుగా ఓటీటీలో రిలీజ్?
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు మూవీ దటీజ్ మహాలక్ష్మి. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆరేళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది
Entertainment | Published On Mar 23, 2026, 4.07 pm IST
Tamannaah | హనుమాన్ మూవీతో స్టార్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు ప్రశాంత్ వర్మ. కేవలం నలభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 350 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది. ఇండియన్ సూపర్ హీరో మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం హనుమాన్‌కు సీక్వెల్‌గా జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
ఆరేళ్ల తర్వాత...
కాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఓ తెలుగు మూవీ షూటింగ్ పూర్తయిన ఆరేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. . దటీజ్ మహాలక్ష్మి పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. కంగనా రనౌత్ బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ 2020లోనే పూర్త యింది. కానీ అనివార్య కారణాల వల్ల రిలీజ్‌కు నోచుకోలేదు.
ఓటీటీలోకి...
ఎట్టకేలకు దటీజ్ మహాలక్ష్మి విడుదలకు సంబంధించిన అడ్డంకులన్నీ క్లియర్ అయినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుందట. అయితే థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో తమన్నా మూవీ సందడి చేయబోతున్నట్లు టాక్. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దటీజ్ మహాలక్ష్మి స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే విడుదల తేదీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ....
దటీజ్ మహాలక్ష్మి మూవీలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ కామెడీ డ్రామా మూవీలో మహాలక్ష్మి అనే పల్లెటూరి యువతిగా తమన్నా నటించింది. మహాలక్ష్మికి ఓ యువకుడితో పెళ్లి కుదరుతుంది. వివాహం మరో కొద్ది రోజుల్లో ఉందనగా మహాలక్ష్మిని పెళ్లిచేసుకోవడానికి పెళ్లికొడుకు నిరాకరిస్తాడు. అప్పటికే ప్యారిస్‌కు హానీమూన్ టికెట్స్ బుక్ చేస్తారు కుటుంబసభ్యులు. పెళ్లి క్యాన్సిల్ కావడంతో మహాలక్ష్మి ఒక్కటే ప్యారిస్ వెళుతుంది. అక్కడ ఆమెకు ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురయ్యాయి? కొత్త లైఫ్‌ను మహాలక్ష్మి ఎలా మొదలుపెట్టింది అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.తమన్నా ప్రస్తుతం తమిళంలో పురుషన్ అనే సినిమా చేస్తోంది. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ మొగుడు పేరుతో తెలుగులో రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






