త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో ఐటెంసాంగ్ – మిల్కీ బ్యూటీ క‌ల నెర‌వేర‌నుందా?

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న రౌడీ జ‌నార్ధ‌న షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీకి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Jan 26, 2026, 5.19 pm IST

Tamannaah | విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో ఐటెంసాంగ్ – మిల్కీ బ్యూటీ క‌ల నెర‌వేర‌నుందా?
Advertisement

Tamannaah |హీరోయిన్లు ఐటెంసాంగ్స్‌లో క‌నిపిస్తే అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌నే అపోహ ఇది వ‌ర‌కు టాలీవుడ్‌లో (Tollywood) ఉండేది. ఈ రూల్‌ను మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బ్రేక్ చేసింది. ఓ వైపు స్టార్ హీరోల‌తో క‌థానాయిక‌గా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టిస్తోంది. తెలుగుతో పాటు బాలీవుడ్‌లో త‌మ‌న్నా చేసిన స్పెష‌ల్ సాంగ్స్ పెద్ద హిట్ట‌య్యాయి. స్త్రీ 2 మూవీలోని ఆజ్ కీ రాత్ సాంగ్ ఏకంగా వంద కోట్ల వ్యూస్‌ను ద‌క్కించుకుంది. హ‌య్యెస్ట్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న స్పెష‌ల్ సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

రౌడీ జ‌నార్ధ‌న‌లో...

తాజాగా తెలుగులో త‌మ‌న్నా మ‌రో స్పెష‌ల్ సాంగ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రౌడీ జ‌నార్ధ‌న పేరుతో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. రౌడీ జ‌నార్ధ‌న‌లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో కోస్తా తీర ప్రాంతం నేప‌థ్యంలో ఈ మూవీ సాగ‌నుంద‌ట‌. అల‌నాటి వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తూ ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌ను షూట్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ ఐటెంసాంగ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి త‌మ‌న్నా న‌టించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండతో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో త‌మ‌న్నా వెల్ల‌డించింది. రౌడీ జ‌నార్ధ‌న‌తో మిల్కీ బ్యూటీ కోరిక తీర‌నున్న‌ట్లు స‌మాచారం.

కీర్తి సురేష్ హీరోయిన్...

రౌడీ జ‌నార్ధ‌న మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబ‌ర్‌లో ఈ యాక్ష‌న్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ విల‌న్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ధీటుగా ఆయ‌న క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని అంటున్నారు. ఈ సినిమాకు క్రిస్టో జేవియ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

గ‌త ఏడాది తెలుగులో ఓదెల 2 సినిమా చేసింది త‌మ‌న్నా. సంప‌త్ నంది క‌థ‌ను అందించిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. తెలుగు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన త‌మ‌న్నా బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది. మూడు సినిమాలు చేస్తోంది. త‌మిళంలో విశాల్ హీరోగా న‌టిస్తున్న మొగుడు మూవీలో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement