త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | రెమ్యూన‌రేష‌న్ లేకుండా ఫ్రీగా బాలీవుడ్ సినిమా చేసిన త‌మ‌న్నా

ఒక్క రూపాయి కూడా రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండా బాలీవుడ్ మూవీ ఓ రోమియోలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఫ్రీగా న‌టించింద‌ట‌.ఈ విష‌యాన్ని సినిమా ప్ర‌మోష‌న్స్‌లో డైరెక్ట‌ర్ విశాల్ భ‌ర‌ద్వాజ్ రివీల్ చేశాడు. త‌మ‌న్నాతో పాటు హీరో విక్రాంత్ మాస్సే కూడా రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండానే ఈ సినిమా చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

N

Entertainment | Published On Feb 9, 2026, 8.32 pm IST

Tamannaah | రెమ్యూన‌రేష‌న్ లేకుండా ఫ్రీగా బాలీవుడ్ సినిమా చేసిన త‌మ‌న్నా
Advertisement

Tamannaah | సినిమా ఇండ‌స్ట్రీలో హీరోహీరోయిన్ల రెమ్యూన‌రేష‌న్ల టాపిక్ ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశంగానే ఉంటుంది. ఓ భారీ బ‌డ్జెట్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు... ఆ మూవీ కోసం హీరోహీరోయిన్లు ఎన్ని కోట్ల రెమ్యూన‌రేష‌న్లు డిమాండ్ చేశార‌నే వార్త‌లు తెగ చ‌క్క‌ర్లు కొడుతుంటాయి. రెమ్యూన‌రేష‌న్ల విష‌యంలో ఫ్యాన్ వార్స్ జ‌ర‌గ‌డం కామ‌న్‌గా మారింది. ఈ రూమ‌ర్ల‌కు త‌గ్గ‌ట్లే స్టార్స్ రెమ్యూన‌రేష‌న్లు వంద‌ల కోట్లకు చేరుకున్నాయి. సినిమా నిర్మాణంలో స‌గానికిపైగా నిర్మాత‌లు రెమ్యూన‌రేష‌న్ల కోస‌మే కేటాయించాల్సివ‌స్తోంది. ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌, షారుఖ్‌ఖాన్ వంటి స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రెండు వంద‌ల కోట్ల‌కుపైనే రెమ్యూన‌రేష‌న్లు తీసుకుంటున్నారు. రెండు, మూడు నిమిషాల యాడ్‌లో న‌టించినందుకు కూడా యాభై కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నారు.

ఒక్క రూపాయి లేకుండా...

కాగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓ బాలీవుడ్ మూవీలో న‌టించింద‌ట‌. షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించిన ఓ రోమియో మూవీ ఫిబ్ర‌వ‌రి 13న రిలీజ్ కాబోతుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు విశాల్ భ‌ర‌ద్వాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గ్యాంగ్‌స్ట‌ర్ హుస్సేన్ ఉస్తారా జీవితం ఆధారంగా వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.

12 రోజుల పాటు షూటింగ్‌...

త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో నానా ప‌టేక‌ర్‌, త‌మ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విక్రాంత్ మాస్సే గెస్ట్ రోల్ చేశారు. ఓ రోమియోలో న‌టించినందుకు త‌మ‌న్నాతో పాటు విక్రాంత్ మాస్సే ఒక్క రూపాయి కూడా రెమ్యూన‌రేష‌న్ తీసుకోలేద‌ట‌. ఫ్రీగా ఈ సినిమాలో వీరిద్ద‌రు న‌టించిన‌ట్లు డైరెక్ట‌ర్ విశాల్ భ‌ర‌ద్వాజ్ ప్ర‌మోష‌న్స్‌లో వెల్ల‌డించాడు. 12 రోజుల పాటు త‌మ‌న్నా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న‌ద‌ట‌. అంత‌కంటే ముందు రిహార్స‌ల్స్‌, వ‌ర్క్‌షాప్స్‌కు అటెండ్ అయిన‌ట్లు స‌మాచారం. క‌థ‌తో పాటు త‌న‌పై ఉన్న గౌర‌వంతో రెమ్యూన‌రేష‌న్ లేకుండానే త‌మ‌న్నా ఈ సినిమాలో న‌టించిన‌ట్లు విశాల్ భ‌ర‌ద్వాజ్ వెల్ల‌డించారు.
ఓ రోమియో మూవీలో త‌మ‌న్నా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో న‌టించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం త‌మిళంలో పురుష‌న్ సినిమా చేస్తోంది త‌మ‌న్నా. విశాల్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ తెలుగులో మొగుడు పేరుతో రిలీజ్ కాబోతుంది.

Advertisement
Advertisement