OTT | ఓటీటీలోకి తాప్సీ బాలీవుడ్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్
తాప్సీ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ అస్సీ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా క్రిటిక్స్‌ను మెప్పించింది. కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 17న జీ5 ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Apr 14, 2026, 2.45 pm IST
OTT | గత కొన్నేళ్లుగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటోంది తాప్సీ. ఫిమేల్ సెంట్రికల్ మూవీస్, ప్రయోగాత్మక కథలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. ఇటీవలే అస్సీ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది తాప్సీ. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కానీ నిర్మాతలకు మాత్రం నష్టాలను తెచ్చిపెట్టింది.
ఓటీటీలోకి...
తాజాగా అస్సీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్ 17 నుంచి జీ5 ఓటీటీలో ఈ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. అస్సీ మూవీకి బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. కనీ కస్తూరి, రేవతి కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి మూడో వారంలో అస్సీ థియేటర్లలో రిలీజైంది.
నేషనల్ అవార్డ్...
అస్సీ మూవీలో లాయర్‌గా తాప్సీ నటన అద్భుతమంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమాకుగాను ఈసారి తాప్సీకి బెస్ట్ హీరోయిన్‌గా నేషనల్ అవార్డ్ రావడం ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఊహించని ట్విస్ట్‌తో క్లైమాక్స్‌ను ముగించిన తీరు బాగుందని అన్నారు. మహిళలపై జరుగుతోన్న లైంగిక దాడుల పాయింట్‌తో సందేశాత్మకంగా దర్శకుడు అనుభవ్ సిన్హా ఈ సినిమాను తెరకెక్కించారు. ముప్పై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో కేవలం 12 కోట్లలోపే వసూళ్లను దక్కించుకుంది. నిర్మాతలకు 18 కోట్లకుపైనే నష్టాలను తెచ్చిపెట్టింది. అస్సీ మూవీకి డైరెక్టర్ అనుభవ్ సిన్హా ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు.
లాయర్ రావి....
పరిమ ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తోన్న క్రమంలో ఐదుగురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతారు. ఆమెను తీవ్రంగా గాయపరుస్తారు. ఈ కేసు సంచలనంగా మారుతుంది. కానీ తమ పలుకుబడితో ఐదుగురు కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిమ కుటుంబంపైనే తప్పుడు ఆరోపణలు చేస్తారు. పరిమ తరపున ఈ కేసును కోర్టులో వాదించడానికి లాయర్ రావి ముందుకొస్తోంది. ఆ తర్వాత ఏమైంది? పరిమకు జరిగిన అన్యాయాన్ని రావి ఎలా బయటపెట్టింది? ఆమెపై బెదిరింపులకు పాల్పడింది ఎవరు అన్నదే అస్సీ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



