త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Taapsee | థియేట‌ర్ల‌లో కాదు…నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ – స్ట్రీమింగ్ డేట్ ఇదే!

తాప్సీ హీరోయిన్‌గా న‌టించిన లేడీ ఓరియెంటెడ్ బాలీవుడ్ మూవీ గాంధారి థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. సెప్టెంబ‌ర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాకు క‌నికా థిల్లాన్ రైట‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

N

Entertainment | Published On Aug 21, 2026, 1.34 pm IST

Taapsee | థియేట‌ర్ల‌లో కాదు…నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ – స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Advertisement

Taapsee | యంగ్ హీరోయిన్ల దూకుడుతో తాప్సీకి అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూర‌మైన ఈ ఢిల్లీ బ్యూటీ అడ‌పాద‌డ‌పా లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తోంది. ఈ ఏడాది అస్సీ సినిమా చేసింది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ బాలీవుడ్ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అతి క‌ష్టంగా ప‌ది కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది.

నేరుగా ఓటీటీలో...

ఈ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ తాప్సీ నెక్స్ట్ మూవీపై ప‌డింది. ఈ బాలీవుడ్ బ్యూటీ న‌టించిన కొత్త మూవీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. తాప్సీ హీరోయిన్‌గా గాంధారి పేరుతో రివేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రూపొందింది. ఈ సినిమాను రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు క‌నికా థిల్లాన్ నిర్మించింది. దేవాషిష్ మాకీజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో...

గాంధారిలో మూవీ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యాయి. సెప్టెంబ‌ర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. గాంధారిలో ఇశ్వాక్ సింగ్‌, ఛాయా క‌ద‌మ్‌, స్వాస్తిక ముఖ‌ర్జీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
గాంధారిలో త‌ల్లి పాత్ర‌లో తాప్సీ క‌నిపించ‌బోతుంది. గ్లామ‌ర్ లేకుండా కంప్లీట్ రా అండ్ ర‌స్టిక్ లుక్‌లో ఈ బాలీవుడ్ బ్యూటీ క‌నిపించ‌బోతున్న‌ది. మురికివాడ‌ల‌కు చెందిన హ్యుమ‌న్ ట్రాఫికింగ్ ముఠా బారి నుంచి త‌న కూతురిని ఓ త‌ల్లి ఎలా కాపాడుకుంద‌నే పాయింట్‌తో గాంధారి మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.

రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు...

క‌నికా థిల్లాన్ ఈ సినిమాకు క‌థ‌ను అందిస్తూ నిర్మించారు. రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు అయిన క‌నికా థిల్లాన్ బాలీవుడ్‌లో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేసింది. గాంధారితోనే ప్రొడ్యూస‌ర్‌గా ఎంట్రీ ఇస్తోంది. రాఘ‌వేంద్ర‌రావు కొడుకు ప్ర‌కాష్ కోవెల‌మూడితో క‌నికా థిల్లాన్ పెళ్లి 2013లో జ‌రిగింది. విభేదాల కార‌ణంగా 2017లో విడాకులు తీసుకున్నారు.

 

Advertisement
Advertisement