Suriya | ఫ్యామిలీ మ్యాన్‌గా సూర్య – వెంకీ అట్లూరి మూవీకి వెరైటీ టైటిల్ ఫిక్స్ – రిలీజ్ ఎప్పుడంటే?
సూర్య హీరోగా వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న తెలుగు మూవీ టైటిల్ ఫిక్సయ్యింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీకి విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూలైలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Entertainment | Published On Mar 2, 2026, 11.02 am IST
Suriya |సూర్య హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియన్ మూవీ రూపొందుతోంది. సూర్య గత సినిమాలకు భిన్నంగా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.
విశ్వనాథ్ అండ్ సన్స్...
సోమవారం సూర్య, వెంకీ అట్లూరి మూవీ టైటిల్ రివీలైంది. ఈ సినిమాకు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. సోమవారం నాడు టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బాబే క్యారియర్‌లో ఓ చిన్నారితో సన్ గ్లాసెస్ పెట్టుకొని చేతిలో పాల డబ్బాతో కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌లా సూర్య కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పెద్ద ఆఫీస్ కనిపిస్తోంది. సూర్య లుక్ ఆసక్తిని పంచుతోంది. జూలైలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇరవై ఏళ్ల అమ్మాయితో...
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఎమోషనల్ డ్రామాగా విశ్వనాథ్ అండ్ సన్స్ రూపొందుతోన్నట్లు సమాచారం. ఇందులో మధ్య వయస్కుడైన వ్యక్తి పాత్రలో సూర్య కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడి జీవితంలోకి ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి ఎలా వచ్చింది? వారిద్దరి అనుబంధం ఎలాంటి మలుపులు తిరిగిందనే కాన్సెప్ట్‌తో వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్ట్రెయిట్ తెలుగు మూవీ
లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య చేస్తోన్న స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇది. తమిళంలో సేమ్ టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్లు రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. సూర్య హీరోగా నటిస్తోన్న 46వ మూవీ ఇది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు.
సంబంధిత వార్తలు

Karuppu | మరో వివాదంలో త్రిష కరుప్పు మూవీ – ఇళయరాజా ఫ్యాన్స్ ఫైర్ – క్షమాపణలు చెప్పిన మేకర్స్
మే 19, 2026

Trisha | సూర్య, త్రిష మధ్య విభేదాలు? – చెన్నై క్వీన్‌ను అవమానించారంటూ ఫ్యాన్స్ ఫైర్
మే 18, 2026

karuppu collections | కరుప్పు ఫస్ట్ డే కలెక్షన్స్ – విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ హిట్ త్రిషదే!
మే 16, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



