త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sara Arjun | సారా అర్జున్ వ‌ర్సెస్ మ‌మితా బైజు – రామ్‌చ‌ర‌ణ్‌తో జోడీ క‌ట్టేది ఎవ‌రంటే?

రామ్‌చ‌ర‌ణ్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ ఈ నెల‌లోనే ప్రారంభం కాబోతుంది. అక్టోబ‌ర్ 26 లేదా 27న పాన్ ఇండియ‌న్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు నిర్మాత ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్‌తో పాటు మ‌మితా బైజు పేర్లు ప్ర‌చారం జ‌రుగుతోన్నాయి.

N

Entertainment | Published On Oct 22, 2026, 5.02 pm IST

Sara Arjun | సారా అర్జున్ వ‌ర్సెస్ మ‌మితా బైజు – రామ్‌చ‌ర‌ణ్‌తో జోడీ క‌ట్టేది ఎవ‌రంటే?
Advertisement

Sara Arjun |  పెద్ది త‌ర్వాత వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్‌. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై  ఓ రేంజ్‌లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ద‌స‌రాకు ఈ మూవీ అఫీషియ‌ల్‌గా లాంఛ్ కావాల్సింది. కానీ మంచి రోజులు లేక‌పోవ‌డంతో ప్రారంభోత్స‌వ వేడుక‌ను వాయిదా వేసిన‌ట్లు నిర్మాత న‌వీన్ యెర్నేని ప్ర‌క‌టించారు.

చీఫ్ గెస్ట్‌...

అక్టోబ‌ర్ 26 లేదా 27న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా అటెండ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌లువురు టాలీవుడ్ సెలిబ్రిటీలు ఓపెనింగ్ వేడుక‌లో పాల్గొన‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్నారు.

స్టైలిష్ యాక్ష‌న్ మూవీ...

పుష్ప‌, పుష్ప 2 సినిమాల‌ను రా అండ్ ర‌స్టిక్ జాన‌ర్‌లో తెర‌కెక్కించిన సుకుమార్...రామ్‌చ‌ర‌ణ్ మూవీ కోసం త‌న పంథా మార్చ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ పాన్ ఇండియ‌న్ మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇందులో అంత‌ర్లీనంగా త‌ల్లికొడుకుల సెంటిమెంట్ ఉండ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

ఎవ‌రు హీరోయిన్‌...

రామ్‌చ‌ర‌ణ్, సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ధురంధ‌ర్ బ్యూటీ సారా అర్జున్ క‌థానాయిక‌గా ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు చెబుతున్నారు. ఆమెతో పాటు మ‌ల‌యాళ బ్యూటీ మ‌మితా బైజు పేరు కూడా స‌డెన్‌గా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్‌, బెత్లెహం కుడుంబ యూనిట్ విజ‌యాల‌తో ద‌క్షిణాదితో ఈ మ‌ల‌యాళ బ్యూటీ పేరు మారుమోగుతోంది. తెలుగులోనూ ఆమెకు మంచి క్రేజ్ ఏర్ప‌డ‌టంతో రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో ఈ అమ్మ‌డిని క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావిస్తోన్న‌ట్లు స‌మాచారం.
వీరిద్ద‌రితో పాటు మ‌రో మ‌ల‌యాళ హీరోయిన్‌ ప్రీతి ముకుంద‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల‌పై మూవీ ఓపెనింగ్ రోజే క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 17వ మూవీ ఇది.

 

Advertisement
Advertisement