Suriya | తెలుగు సింగర్‌గా హీరో సూర్య – విశ్వనాథ్ అండ్ సన్స్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సింగర్‌గా మారాడు. తెలుగులో పాట పాడాడు. సూర్య హీరోగా నటిస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి వెడ్డింగ్ సాంగ్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం రెండు భాషల్లో ఈ పాటను సూర్య స్వయంగా ఆలపించడం గమనార్హం.
Entertainment | Published On Jul 25, 2026, 7.13 pm IST
Suriya | విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కోసం హీరో సూర్య సింగర్‌గా మారాడు. తెలుగుతో పాటు తమిళంలో పాట పాడారు. సూర్య, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఆగస్ట్ 14న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి వెడ్డింగ్ సాంగ్‌ను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను హీరో సూర్య స్వయంగా ఆలపించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. తెలుగులో సూర్య పాడిన ఫస్ట్ సాంగ్ ఇదే. బర్‌సే...రంగ్ బర్‌సే కలలు మురిసే అంటూ సాగిన ఈ పాట ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో సూర్య వేసిన హేక్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ వెడ్డింగ్ సాంగ్‌ను సూర్యనే పాడటం గమనార్హం.
ఏజ్ గ్యాప్...
తనకంటే వయసులో చాలా పెద్దవాడైన ఓ వ్యక్తితో ప్రేమలో పడిన అమ్మాయి కథతో విశ్వనాథ్ అండ్ సన్స్ తెరకెక్కుతోంది. స్ట్రెయిట్ తమిళ మూవీగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. సాయి సౌజన్యతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి నేనో బటర్‌ఫ్లై అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ సాంగ్‌కు పది మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి.
కరుప్పుతో కమ్‌బ్యాక్....
విశ్వనాథ్ అండ్ సన్స్‌లో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే కరుప్పు మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత పెద్ద హిట్టు అందుకున్నాడు. ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం మలయాళ డైరెక్టర్ జీతూ మాధవన్‌తో పాటు జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌తో సూర్య సినిమాలు చేస్తోన్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tamannaah | హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌లా చూస్తారు – సౌత్ ఇండస్ట్రీపై తమన్నా కామెంట్లు
జులై 25, 2026

Shruti Haasan | ఆ ప్రశ్న అడగొద్దు – పెళ్లిపై శృతి హాసన్ సీరియస్ కామెంట్స్ – నెటిజన్‌కు వార్నింగ్
జులై 24, 2026

Jana Nayagan Collection | జననాయగన్ ఫస్ట్ డే కలెక్షన్స్ – దళపతి విజయ్ ఆ రెండు డిజాస్టర్ల కంటే తక్కువే!
జులై 24, 2026
తాజావార్తలు
- ●Mandula Samuel | కాంగ్రెస్‌లకొస్తే నువ్ గెలుస్తవ్ సామేల్ అన్నడు.. నేన్ అబద్దమాడా
- ●Dharmendra Pradhan Resignation | ఒకనాడు స్టూడెంట్ లీడర్‌గా పోరాటం.. నేడు అదే వ్యవహారంతో రాజీనామా: ధర్మేంద్ర ప్రధాన్ 'కర్మ' రిటర్న్స్!
- ●Minister Seethakka | లక్ష్యం సాధిస్తే సీఎం చేతుల మీదుగా సన్మానం: మంత్రి సీతక్క
- ●KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!
- ●Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్.. హెల్ప్‌లైన్ నంబర్ ఇదే
- ●CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన 'నీట్' మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ

Mandula Samuel | కాంగ్రెస్‌లకొస్తే నువ్ గెలుస్తవ్ సామేల్ అన్నడు.. నేన్ అబద్దమాడా

Dharmendra Pradhan Resignation | ఒకనాడు స్టూడెంట్ లీడర్‌గా పోరాటం.. నేడు అదే వ్యవహారంతో రాజీనామా: ధర్మేంద్ర ప్రధాన్ 'కర్మ' రిటర్న్స్!

Minister Seethakka | లక్ష్యం సాధిస్తే సీఎం చేతుల మీదుగా సన్మానం: మంత్రి సీతక్క

KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!



