త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి సూర్య‌, త్రిష 300 కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ – హింట్ వ‌చ్చేసిందిగా!

సూర్య‌, త్రిష హీరోహీరోయిన్లుగా న‌టించిన క‌రుప్పు మూవీ థియేట‌ర్ల‌లో మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. క‌రుప్పు ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆదివారం అమెజాన్ ప్రైమ్ హింట్ ఇచ్చింది.

N

Entertainment | Published On Jun 7, 2026, 8.46 pm IST

OTT | అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి సూర్య‌, త్రిష 300 కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ – హింట్ వ‌చ్చేసిందిగా!
Advertisement

OTT |  సూర్య‌, త్రిష హీరోహీరోయిన్లుగా న‌టించిన క‌రుప్పు ఈ ఏడాది కోలీవుడ్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 140 కోట్ల బ‌డ్జెట్‌తో ఫాంట‌సీ యాక్ష‌న్‌గా రూపొందిన ఈ మూవీ 300 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. క‌రుప్పు మూవీతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత హీరోగా బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు సూర్య‌. అత‌డి క‌మ్‌బ్యాక్ మూవీగా ఈ సినిమా నిలిచింది.

ఓటీటీపై హింట్‌...

క‌రుప్పు మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌పై ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆదివారం అఫీషియ‌ల్‌గా హింట్ ఇచ్చింది. క‌రుప్పు డిజిట‌ల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకుంది. గాడ్‌మోడ్ ఆన్ అంటూ ఓ ఫొటోను అమెజాన్ ఆదివారం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో క‌రుప్పు పోస్ట‌ర్ క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఉద్దేశించే అమెజాన్ ప్రైమ్ ఈ పోస్ట్ పెట్టింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. జూన్ 12న సూర్య‌, త్రిష మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చెబుతున్నారు.

అనేక అడ్డంకులు...

క‌రుప్పు మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ఈ సినిమాలో విల‌న్‌గా ఆర్‌జే బాలాజీ క‌నిపించాడు. స్వాసిక‌, శిశ్విద‌, ఇంద్రాన్స్ కీల‌క పాత్ర‌లు పోషించారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా అనేక అడ్డంకుల‌ను ఎదుర్కొంది. ఫైనాన్షియ‌ల్ ఇష్యూస్ కార‌ణంగా విడుద‌ల‌కు కొన్ని గంట‌ల ముందు పోస్ట్‌పోన్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
కాన్సెప్ట్ రొటీన్ అని కామెంట్స్ వ‌చ్చినా...సూర్య యాక్టింగ్‌, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్‌కు ఆడియెన్స్ క‌నెక్ట్ కావ‌డంతో సినిమా హిట్ట‌య్యింది. త్రిష క్రేజ్ కూడా సినిమా విజ‌యానికి హెల్ప‌య్యింది. వీర‌భ‌ద్రుడు పేరుతో తెలుగులో రిలీజైన ఈ మూవీ ఇక్క‌డ కూడా నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

వీర‌భ‌ద్రుడి సాయం...

హాస్పిట‌ల్‌లో ట్రీట్‌మెంట్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన ఓ తండ్రీకూతుళ్ల ద‌గ్గ‌ర నుంచి బంగారాన్ని దొంగ‌లు దోచుకుంటారు. పోలీసులు రిక‌వ‌రీ చేసిన ఆ బంగారాన్ని కోర్టు ద్వారా తిరిగి తీసుకోవాల‌ని వాళ్లు అనుకుంటారు. కానీ లాయ‌ర్ బేబీ కృష్ణ కేసును డిలే చేస్తూ వారి బంగారాన్ని కొట్టేయాల‌ని చూస్తాడు. ఆ తండ్రీకూతుళ్ల‌కు వీర‌భ‌ద్రుడు ఎలాంటి సాయం చేశాడు? వీర‌భ‌ద్రుడికి సాయం చేసిన లాయ‌ర్ ప్రీతి ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement