Harish Rao | గోల్డెన్ షేక్ హ్యాండ్ పెట్టేందుకు రేవంత్ ప్రయత్నాలు.. సింగరేణి కార్మికులను హెచ్చరించిన హరీశ్‌రావు
Harish Rao | గోల్డెన్ షేక్ హ్యాండ్ మళ్లీ పెడతామని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గోదావరిఖని శ్రీమయి కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో 'కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో' నినాదంతో సింగరేణి పరిరక్షణ సదస్సు జరిగింది.
Harish Rao | గోల్డెన్ షేక్ హ్యాండ్ మళ్లీ పెడతామని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గోదావరిఖని శ్రీమయి కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో 'కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో' నినాదంతో సింగరేణి పరిరక్షణ సదస్సు జరిగింది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దివాకర్ రావు, పుట్ట మధు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు మూల విజయ రెడ్డి, జక్కు శ్రీ హర్షిణి పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి సభను హరీశ్ ప్రారంభించారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, అక్రమాలపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె లో సింగరేణి కార్మికుల పాత్ర గొప్పదన్నారు. చంద్రబాబు నాయుడు గోల్డెన్ షేక్ హ్యాండ్ తో కార్మికులను తొలగించారని, కేసీఆర్ 19వేల మందికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి మాట కేసీఆర్ నిలుపుకున్నాడన్నారు.
కాంగ్రెస్ పాలనలో నష్టాల్లోకి..
సింగరేణి స్థలాల్లో ఇండ్లకు హక్కులు కల్పించామన్నారు. చంద్రబాబు నాయుడు శిష్యుడే రేవంత్ రెడ్డి అని, మళ్లీ ఉద్యోగాలు తీసేస్తా అంటున్నారన్నారు. గోల్డెన్ షేక్ హ్యాండ్ మళ్ళీ పెడతామని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. మెడికల్ బోర్డు పెట్టకుండా కార్మిక కుటుంబాలను గోస పెడుతున్నారని, బైపాస్ సర్జరీలు అయిన వాళ్ళను ఫిట్ అంటూ ఉద్యోగం చేయాలని వేధిస్తున్నారని మండిపడ్డారు. గెలిచిన గుర్తింపు సంఘాలు కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని, సింగరేణి కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. కార్మికులే సింగరేణి సంస్థను కాపాడుకోవాలని సూచించారు. 16శాతం ఉన్న లాభాల వాటా 33శాతానికి పెంచింది కేసీఆర్ అని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల బాటలోకి వెళ్తుందని, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలని అంటున్నారని తెలిపారు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్కు డిపాజిట్లు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావని, అర్జీ-1 సీహెచ్‌పీకి వెళ్తే వందల పోలీసులతో అడ్డుకున్నారని ఆరోపించారు. సైట్ విజిటింగ్ స్కాం, సోలార్ పవర్ స్కాంతో పాటు అనేక స్కాంలకు పాల్పడింది కాంగ్రెస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని సైట్ విజిటింగ్ రూల్ కాంగ్రెస్ పెట్టిందని, రేవంత్ బావమర్ది కోసమే సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ విధానం తెచ్చారని మండిపడ్డారు. ఓబీ టెండర్లలో మైనస్ కోట్ చేసేది, సైట్ విజిటింగ్ తో ప్లస్ టెండర్ కోట్ చేస్తున్నారని, సైట్ విజిటింగ్‌తో మొదటి టెండర్ సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి దక్కిందని ఆరోపించారు. సింగరేణి సొమ్ము దోచుకుంటున్నారని, బీఆర్ఎస్ పోరాటంతో నైనీ బ్లాక్ రద్దు చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బావ మరిది టెండర్ ఎందుకు రద్దు చేయలేదు? హరీశ్ ప్రశ్నించారు. శ్రీరాంపూర్ ప్రకాశం ఖానీ టెండర్లు 7 సార్లు రద్దు చేశారని, అవసరం లేని సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ల డబ్బులు కమీషన్లకు ఖర్చు చేశారని, జిలెటిన్ స్టిక్స్ లో కూడా కుంభకోణం జరిగిందని ఆరోపించారు. వాళ్లకు అనుకూలంగా లేని అధికారులపై ఒత్తిడి చేశారని ఆరోపించారు.
రక్తపు చుక్కలను దోచుకుంటున్నరు..
జీవీరెడ్డిపై బిట్టి తీస్తే ఆయన రాజీనామా చేశాడని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని తప్పుడు లెక్కలు చెప్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రశ్నించినందుకు 26 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్తున్నారన్నారు. రూ.1600 కోట్లు విలువ చేసే బొగ్గు.. 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు అర్జీ 1లో ఉన్నాయని చెప్తున్నారని, ఎక్కడ ఉంది? ప్రశ్నించారు. అర్జీ 1 CHP వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారన్నారు. బొగ్గు ఉంటే అడ్డుకోవడం ఎందుకు అంటూ నిలదీశారు. బొగ్గు నిల్వలు లేవు కాబట్టే మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. గొప్పలు చెప్పుకోవడానికి అప్పటి సీఎండీ 2025 మార్చి నాటికి 90 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని ట్యాక్స్, డీఎంఎఫ్టి, సీఎస్ఆర్, కోల్ సెస్, చెల్లించారన్నారు. సింగరేణి కార్మికుల రక్తపు చుక్కలను దోచుకున్నారని, 40శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందని మండిపడ్డారు. అడ్రియాల లాంగ్ వాల్ గనిలో ఏడాది నుంచి ఉత్పత్తే లేదని.. 1,69,870 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు లెక్కలు చూపిస్తున్నారని.. ఇంత కన్నా సిగ్గుచేటు మరొకటి లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం లేదని, ఈ ఏడాది 75శాతమే ఉత్పత్తి జరిగిందన్నారు.
నిల్వలు ఉంటే అడ్డుకోవడం ఎందుకు?
బొగ్గు నిల్వలు పరిశీలించడానికి వెళితే వందల పోలీసులతో అడ్డుకోవడం ఎందుకని, తాము టెర్రరిస్టులం కాదన్నారు. సింగరేణి.. కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదని, ఎన్టీపీసీని కాదని రాజస్తాన్ తో కలిసి పాకిస్తాన్ సరిహద్దులో పవర్ ప్లాంట్ ఎందుకు నిర్మిస్తున్నారని నిలదీశారు. PPA, DPR, లేకుండా సివిల్ వర్కులు ప్రారంభించారని, సోలార్ పవర్ ప్లాంట్లతో రోజుకి 2 కోట్ల నష్టం జరుగుతుందన్నారు. పాకిస్తాన్ బార్డర్ లో సోలార్ పవర్ ప్లాంటు ఎందుకు.. రాజస్తాన్ రాజధానిలో సింగరేణి కార్యాలయం కట్టిండ్రు ప్రశ్నించారు. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జనం చూడవద్దని గోదావరిఖనిలో కరెంట్ కట్ చేశారని.. పదేళ్ల బీఆర్ఎస్ హయంలో సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు 7 వేల కోట్లు మాత్రమేనన్నారు. కాంగ్రెస్ వచ్చిన రెండేండ్లలో రాష్ట్ర బకాయి 19 వేల 330 కోట్లు చేరిందని.. సింగరేణి అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమే రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సింగరేని ఓడీ 4వేలకోట్లు.. ఒకప్పుడు ఎఫ్‌డీలు ఉన్న సింగరేణి నేడు ఓడీల్లో కొనసాగుతుందన్నారు. కార్మికులు మేల్కొనాలని పిలుపునిచ్చారు. 19 వేల మందికి వారసత్వ ఇచ్చింది కేసీఆర్ అని.. మారు పేర్లు, విజిలెన్స్ పేరిట ఉద్యోగాలు ఆపిండ్రని మండిపడ్డారు. మెడికల్ బోర్డులు పెట్టకుండా డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని.. మేనిఫెస్టోలో రాసిన శ్రీధర్ బాబు డిపెండ్మెంట్ ఉద్యోగాలు ఇచ్చావా? అంటూ నిలదీశారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య నియామకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 49శాతం వాటా ఉన్న బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిలో జరిగే అక్రమాలపై ఎందుకు మాట్లాడడం లేదని, కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డితో సంబంధం లేకుంటే సెంట్రల్ విజిలెన్స్ తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●OTT | అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి సూర్య, త్రిష 300 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - హింట్ వచ్చేసిందిగా!
- ●MP Kishan Reddy | చర్చకు సిద్ధమా.. సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్
- ●Janhvi Kapoor | పెద్దిలో జాన్వీ కపూర్ రోల్‌పై విమర్శలు.. బాలీవుడ్ నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్..!
- ●CM Revanth Reddy | ఈ 100 రోజుల్లోనే మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
- ●KTR | నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత

OTT | అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి సూర్య, త్రిష 300 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - హింట్ వచ్చేసిందిగా!

MP Kishan Reddy | చర్చకు సిద్ధమా.. సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్

Janhvi Kapoor | పెద్దిలో జాన్వీ కపూర్ రోల్‌పై విమర్శలు.. బాలీవుడ్ నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్..!

CM Revanth Reddy | ఈ 100 రోజుల్లోనే మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తా : సీఎం రేవంత్ రెడ్డి





