Trisha | మెడలో తాళితో త్రిష?.. వైరల్ అవుతున్న చెన్నై క్వీన్ ఫొటోలు
చెన్నై క్వీన్ త్రిష సీక్రెట్‌గా పెళ్లిచేసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెడలో క్రిస్టియన్ తాళితో త్రిష కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jun 7, 2026, 7.33 pm IST
Trisha | చెన్నై క్వీన్ త్రిష ప్రేమ, పెళ్లి వార్తలు గత కొద్ది కాలంగా కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ పుకార్ల నడుమ త్రిష మెడలో తాళిబొట్టుతో కనిపించడం ఆసక్తికరంగా మారింది. త్రిష కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. ఈ ఫొటోల్లో త్రిష మెడలో ఓ లాకెట్ కనిపించింది. అది లాకెట్ కాదని తాళి అని నెటిజన్లు చెబుతోన్నారు. కేరళలో పెళ్లి జరిగినట్లు గుర్తుగా క్రిస్టియన్ మహిళలు ఇలాంటి పెండెంట్ ధరిస్తారని అంటున్నారు. ఈ లాకెట్‌ను మిన్ను అని పిలుస్తారట. మిన్నును పోలి త్రిష మెడలో లాకెట్ ఉందని అంటున్నారు.
తాళి కాదు....
త్రిష సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? అంటూ కామెంట్లు పెడుతోన్నారు. ఇన్‌డైరెక్ట్‌గా తన పెళ్లి గురించి ఈ లాకెట్‌తో క్లారిటీ ఇచ్చిందని చెబుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం అది తాళి కాదని, నార్మల్ లాకెట్ అని అంటున్నారు. నెటిజన్ల కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
సీఎంతో జంటగా...
తమిళనాడు సీఎం దళపతి విజయ్‌ని త్రిష పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ తమిళ సినీ ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకకు విజయ్, త్రిష కలిసి జంటగా హాజరైనప్పటి నుంచి ఈ పుకార్లు మొదలయ్యాయి. ఇటీవల కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి విజయ్, త్రిష జంటగా వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ రూమర్లపై అటు విజయ్‌తో పాటు ఇటు త్రిష సెలైంట్‌గానే ఉంటున్నారు.
కరుప్పుతో....
ఇటీవలే కరుప్పు మూవీతో హీరోయిన్‌గా బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది త్రిష. సూర్య హీరోగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. తెలుగులో త్రిష హీరోయిన్‌గా నటించిన విశ్వంభర త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు.
HOLD UP… TRISHA KRISHNAN IS MARRIED?! 🤯😰💔
Look closely at the pendant guys! That is a 100% typical Kerala Christian style Mangalsutra (Minnu)!!! 📿✨😱
Now the ultimate question is… WHO IS THAT BRIDEGROOM?! 🕵️♂️🔥
Ponnu inga iruku… Maplai enga?????🤷♂️👀🔊 Internet is… pic.twitter.com/rhYPlWOpvI
— 🔥 Satz 🔥 (@thala_speaks) June 7, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●OTT | అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి సూర్య, త్రిష 300 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - హింట్ వచ్చేసిందిగా!
- ●MP Kishan Reddy | చర్చకు సిద్ధమా.. సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్
- ●Janhvi Kapoor | పెద్దిలో జాన్వీ కపూర్ రోల్‌పై విమర్శలు.. బాలీవుడ్ నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్..!
- ●CM Revanth Reddy | ఈ 100 రోజుల్లోనే మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
- ●KTR | నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత

OTT | అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి సూర్య, త్రిష 300 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - హింట్ వచ్చేసిందిగా!

MP Kishan Reddy | చర్చకు సిద్ధమా.. సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి సవాల్

Janhvi Kapoor | పెద్దిలో జాన్వీ కపూర్ రోల్‌పై విమర్శలు.. బాలీవుడ్ నటి మేకప్ ఆర్టిస్ట్ సంచలన పోస్ట్..!

CM Revanth Reddy | ఈ 100 రోజుల్లోనే మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తా : సీఎం రేవంత్ రెడ్డి






