CM Revanth Reddy | ఈ 100 రోజుల్లోనే మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | ఈ వంద రోజుల్లోనే మూసీ నది ప్రక్షాళన పనులు ప్రారంభిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
నేను చేయగలిగింది ఇది ఒక్కటే..
పూర్తిస్థాయిలో అంచనాలు వేయండి
అధికారులకు సీఎం ఆదేశాలు
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఈ వంద రోజుల్లోనే మూసీ నది ప్రక్షాళన పనులు ప్రారంభిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి శంకుస్థాపన సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
మూసీ ప్రక్షాళనలో భాగంగా గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ -1 కింద మొదటి విడతగా పని చేస్తున్నాం. రెండో విడత నాగోలు నుంచి గౌరెల్లి వరకు ఫేజ్-2 కింద ఈ 100 రోజుల్లోనే మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తాం. ఈ ప్రాంతంలో భూసేకరణకు సంబంధించి సమస్యలు పరిష్కరించండి. ఫేజ్ 2 మూసీ ప్రక్షాళన మీద, ఎలివేటెడ్ కారిడార్ మీద, వనస్థలిపుం నుంచి ఇక్కడికి, ఇక్కడ్నుంచి వరంగల్ రోడ్డు వరకు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాను. వంద రోజుల్లో ఫేజ్ 2 పనులు జరగాలి. పూర్తిస్థాయిలో అంచనాలు వేయండి.. ప్రభుత్వ అనుమతులు తీసుకోండి.. ఈ ప్రాంతానికి సేవ చేయగలిగింది ఇదే. నేను చేయగలిగింది ఇది ఒక్కటే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?
- ●HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్
- ●Horoscope | ఆగస్టు 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించిన ఆర్థిక లాభాలు..!
- ●Nizamabad | నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫరల్ హోదా
- ●Telangana Voter List 2026 | ఓటరు జాబితా ప్రక్షాళన: ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు ఒకే పోలింగ్ బూత్
- ●Noida 15-year-old Girl Case | మోదీపై కామెంట్స్.. క్షమాపణ చెప్పినా ఆగని వేధింపులు: రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసిన తల్లీకూతుళ్లు

Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?

HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్

Horoscope | ఆగస్టు 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించిన ఆర్థిక లాభాలు..!

Nizamabad | నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫరల్ హోదా





