త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | పెద్దిలో జాన్వీ క‌పూర్ రోల్‌పై విమ‌ర్శ‌లు.. బాలీవుడ్ న‌టి మేక‌ప్ ఆర్టిస్ట్ సంచ‌ల‌న పోస్ట్..!

Janhvi Kapoor | రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈ నెల 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. ఈ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి జాన్వీ కపూర్ పోషించిన ‘అచియ్యమ్మ’ పాత్ర మేకింగ్‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

P

Entertainment | Published On Jun 7, 2026, 8.39 pm IST

Janhvi Kapoor | పెద్దిలో జాన్వీ క‌పూర్ రోల్‌పై విమ‌ర్శ‌లు.. బాలీవుడ్ న‌టి మేక‌ప్ ఆర్టిస్ట్ సంచ‌ల‌న పోస్ట్..!
Advertisement

Janhvi Kapoor | రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈ నెల 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. ఈ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి జాన్వీ కపూర్ పోషించిన ‘అచియ్యమ్మ’ పాత్ర మేకింగ్‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ కౌర్ మంచందా జాన్వీకి మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్‌ని పెట్టారు. షూటింగ్ స‌మ‌యంలో కొన్ని సన్నివేశాలపై జాన్వీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా.. జాన్వీ పాత్ర‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా స్పందించారు. కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి వచ్చిన అభిప్రాయాలను గమనించామని, ఎలాంటి మహిళా పాత్రను అవమానించాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. సీన్స్‌లో మార్పులు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలిపారు.

ఇక సవ్లీన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో జాన్వీ కపూర్ షూటింగ్, ఆ త‌ర్వాత ద‌శ‌ల్లోనే కొన్ని సీన్ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిపింది. ఇండ‌స్ట్ఈర‌లో మ‌హిళ‌ల పాత్రల విషయంలో జరుగుతున్న అతిగా సెక్సువలైజేషన్‌పై ఆమె తీసుకున్న స్థితికి ఇది అనుగుణంగా ఉందని ఆ పోస్ట్‌లో వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో ఉపయోగించిన కెమెరా యాంగిల్స్‌పై కూడా జాన్వీ అభ్యంతరం తెలిపినట్లు అందులో ప్రస్తావించారు. ఫైన‌ల్ ఎడిటింగ్‌లో ఆ ఫుటేజ్‌ని కొన‌సాగించార‌ని పేర్కొంది. ఇది ఆమె వ్యక్తిగత హద్దులను దర్శకుడు పట్టించుకోకపోవడమేనని ఆ పోస్ట్‌లో ఆరోపించింది. ఇదిలా ఉండ‌గా.. వివాదాల మ‌ధ్య సైతం పెద్ది మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళ్తోంది. సక్నిల్క్ నివేదికల ప్రకారం.. ఈ మూవీ భార‌త్‌లో రూ.125.25 కోట్లు వసూలు చేయగా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.190కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, శివరాజ్‌కుమార్, జ‌గ‌ప‌తిబాబు కీలక పాత్రల్లో న‌టించారు.

Advertisement
Advertisement