త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Kishan Reddy | చ‌ర్చ‌కు సిద్ధ‌మా.. సీఎం రేవంత్‌కు కిష‌న్ రెడ్డి స‌వాల్

MP Kishan Reddy | రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మ‌ధ్య తీవ్ర మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

S

Telangana | Published On Jun 7, 2026, 8.43 pm IST

MP Kishan Reddy | చ‌ర్చ‌కు సిద్ధ‌మా.. సీఎం రేవంత్‌కు కిష‌న్ రెడ్డి స‌వాల్
Advertisement

MP Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మ‌ధ్య తీవ్ర మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌కు, మెట్రో విస్త‌ర‌ణ‌కు కిష‌న్ రెడ్డి అడ్డుప‌డుతున్నార‌ని, మ‌హారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా కూడా కిష‌న్ రెడ్డినే అడ్డుప‌డుతున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ క్ర‌మంలో త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. రేవంత్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడ చర్చ పెట్టినా ఏ అంశంపై అయినా చర్చించేందుకు తాను సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. చ‌ర్చ‌కు రేవంత్ రెడ్డి సిద్ధ‌మా అని స‌వాల్ విసిరారు. రేవంత్ రెడ్డిలా తాను పార్టీలు మారలేదని.. తన పుట్టుక.. చావు రెండూ బీజేపీలోనే అని కిష‌న్ రెడ్డి ఉద్ఘాటించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement