karuppu collections | కరుప్పు ఫస్ట్ డే కలెక్షన్స్ – విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ హిట్ త్రిషదే!
సూర్య కరుప్పు మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. వరల్డ్ వైడ్‌గా 28 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. తెలుగులో మూడు కోట్లకుపైగా కలెక్షన్లతో పర్వాలేదనిపించింది. దళపతి విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ హిట్‌గా కరుప్పు నిలవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు.
Entertainment | Published On May 16, 2026, 6.46 pm IST
Karuppu Collection | mసూర్య, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన కరుప్పు మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. సూర్యతో పాటు చెన్నై క్వీన్ త్రిష కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తమిళంలో పాటు తెలుగులోనూ డీసెంట్ కలెక్షన్స్ దక్కించుకుంది. కరుప్పుకు తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 28 కోట్ల గ్రాస్ , పధ్నాలుగు కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. రీసెంట్ టైమ్‌లో తమిళంలో తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా కరుప్పు రికార్డ్ క్రియేట్ చేసింది. దళపతి విజయ్ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ హిట్‌గా త్రిష మూవీ నిలవడం తమిళనాట ఆసక్తికరంగా మారింది.
తెలుగు కలెక్షన్స్ ఎంతంటే?
కరుప్పు మూవీ తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజైంది. సూర్య, త్రిషకు ఉన్న క్రేజ్ కారణంగా రిలీజ్‌కు ముందు ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా గురువారం రిలీజ్ ముగింట వాయిదాపడటం, షోస్ క్యాన్సిల్ కావడంతో ఆ ఎఫెక్ట్ తెలుగు కలెక్షన్స్‌పై భారీగానే పడింది. మొదటి రోజు వీరభద్రుడు మూవీ తెలుగులో 3.08 కోట్ల గ్రాస్, కోటి అరవై లక్షల షేర్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఏడున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వీరభద్రుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య మూవీ తెలుగులో లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో ఆరు కోట్ల వరకు రావాల్సి ఉంది. వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల వరకు కరుప్పు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కరుప్పు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
వీరభద్రుడి శిక్ష...
కరుప్పు మూవీకి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తూనే ఈ మూవీలో విలన్‌గా నటించాడు. చట్టాన్ని అడ్డుపెట్టుకొని అన్యాయాలకు పాల్పడుతున్న వారిని వీరభద్రుడు ఎలా శిక్షించాడనే పాయింట్‌తో ఈ మూవీ రూపొందింది. సూర్య యాక్టింగ్, ఎలివేషన్లతో పాటు సాయి అభ్యంకర్ మ్యూజిక్ బాగుందనే ప్రశంసలు వస్తున్నాయి. త్రిష రోల్ ప్రాధాన్యత లేకపోవడం, ఆమె రెల్ లెంగ్త్ తక్కువగా ఉండటంపై మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా కరుప్పు మూవీకి తమిళనాట స్పెషల్ షోస్‌కు పర్మిషన్ ఇస్తూ దళపతి విజయ్ టీవీకే ప్రభుత్వం జీవో జారీ చేసింది. విజయ్‌కి కృతజ్ఞతలు చెబుతూ కరుప్పు టైటిల్ కార్డ్స్‌లో ఆయన పేరు వేశారు మేకర్స్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



