Suriya | కోలీవుడ్ హీరో గొప్ప మనసు – సినిమా టీమ్ మెంబర్స్‌కు లగ్జరీ కార్లు గిఫ్ట్
కరుప్పు మూవీతో హీరోగా లాంగ్ గ్యాప్ తర్వాత పెద్ద హిట్‌ను అందుకున్నాడు సూర్య. తనకు బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఇచ్చిన టీమ్ మెంబర్స్‌కు సూర్య లగ్జరీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు.ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On May 31, 2026, 8.30 pm IST
Suriya | కోలీవుడ్ హీరో సూర్య తన మంచి మనసును చాటుకున్నాడు. కరుప్పు టీమ్ మెంబర్స్ అందరికి లగ్జరీ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సూర్య హీరోగా నటించిన కరుప్పు మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్‌గా రూపొందిన ఈ సినిమా మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ ఏడాది తమిళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. కరుప్పుతో లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
మహీంద్ర బీఈ 6
కరుప్పుతో తన హిట్టు ఇచ్చిన యూనిట్ మెంబర్స్ అందరికి సూర్య మహీంద్ర బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్, సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు, ఎడిటర్ కలైవాన్‌తో పాటు మెయిన్ టెక్నీషియన్లు అందరికి కార్లను బహుమతిగా అందజేశాడు. సూర్య కారును గిఫ్ట్‌గా ఇచ్చిన ఫొటోలను సాయి అభ్యంకర్, జీకే విష్ణు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి. సూర్య గిఫ్ట్‌గా ఇచ్చిన ఈ మహీంద్ర బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎలక్ట్రిక్ కార్ల ధర 30 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
దళపతి విజయ్ అనుకుంటే...
కరుప్పు మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించింది. తొలుత ఈ సినిమాలో హీరోగా దళపతి విజయ్‌ని అనుకున్నాడట ఆర్‌జే బాలాజీ. కానీ పొలిటికల్ వ్యవహారాలతో దళపతి విజయ్ బిజీగా ఉండటంతో సూర్య దగ్గరకు ఈ కథ వెళ్లింది.న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన ఓ తండ్రీకూతుళ్లకు ఓ లాయర్ మోసం చేశాడు. అతడి మోసాలకు వీరభద్రుడు ఎలా అడ్డుకట్ట వేశాడు? అసలు వీరభద్రుడు ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

kollywood | హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న ఖుష్బూ కూతురు – డెబ్యూ మూవీలో ధనుష్ మేనల్లుడితో రొమాన్స్
మే 28, 2026

Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ – విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
మే 28, 2026

Samantha | సీఎం విజయ్‌తో సమంత ఢీ – జననాయగన్ వర్సెస్ మా ఇంటి బంగారం బాక్సాఫీస్ ఫైట్
మే 24, 2026
తాజావార్తలు
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు
- ●Sobhita Dhulipala | శోభిత ధూళిపాళ తమిళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ - డైరెక్టర్ ఎవరంటే?
- ●CM Revanth Reddy Asifabad Tour | ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత షురూ: రేపు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
- ●TSUTF | ఆలు లేదు చూలు లేదు.. ముందే ఈహెచ్ఎస్ కటింగ్ మొదలు! ఆర్థిక శాఖ అత్యుత్సాహంపై టీఎస్ యుటీఎఫ్ ఫైర్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్

Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు

Sobhita Dhulipala | శోభిత ధూళిపాళ తమిళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ - డైరెక్టర్ ఎవరంటే?



