త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్న అప్‌క‌మింగ్ కోలీవుడ్ మూవీస్ ఇవే – సూర్య‌, ధ‌నుష్ సినిమాలు కూడా!

సంక్రాంతి కానుక‌గా అప్‌క‌మింగ్ త‌మిళ సినిమాల లిస్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. సూర్య, కార్తీ, ధ‌నుష్‌తో పాటు ప‌లువురు స్టార్ హీరోల సినిమ‌లు ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

N

Entertainment | Published On Jan 15, 2026, 3.50 pm IST

OTT | నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్న అప్‌క‌మింగ్ కోలీవుడ్ మూవీస్ ఇవే – సూర్య‌, ధ‌నుష్ సినిమాలు కూడా!
Advertisement

OTT | సంక్రాంతి రోజున ఓటీటీ ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ గుడ్‌న్యూస్ వినిపించింది. ఈ ఏడాది త‌మ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న స్టార్ హీరోల సినిమాల లిస్ట్‌ను రిలీజ్ చేసింది. సూర్య, కార్తీ, జ‌యం ర‌వితో పాలు ప‌లువురు హీరోల సినిమాలు నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ ఏడాది ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

సూర్య రెండు సినిమాలు...

సూర్య, వెంకీ అట్లూరి మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుక‌గా గురువారం అఫీషియ‌ల్‌గా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించిన నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ర‌వీనా టాండ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సూర్య హీరోగా న‌టిస్తున్న 46వ మూవీ ఇది.
సూర్య, జీతూ మాధ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియ‌న్ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే విడుద‌ల‌కాబోతుంది. రికార్డు ధ‌ర‌కు ఈ రెండు సినిమాల ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం.
కార్తీ మార్ష‌ల్ ఓటీటీ రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. ఈ యాక్ష‌న్ మూవీకి తామిజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్న కార‌తో పాటు రాజ్‌కుమార్ పెరియ‌సామితో చేస్తున్న సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్ ద్వారానే ఓటీటీలోకి రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసిన ఈ రెండు సినిమాల పోస్ట‌ర్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
ఇవే కాకుండా అభిష‌న్ జీవంత్‌ విత్ ల‌వ్, యోగిబాబు ఎన్ ఆర్డిన‌రీ మ్యాన్‌, ఇద‌యం ముర‌ళి, గ‌ట్ట కుస్తీ 2 తో పాటు మ‌రికొన్ని సినిమాల స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement