Nithiin | యంగ్ లుక్‌లో నితిన్ – రుక్మిణి కోసం కృష్ణ నయా అవతారం
అలియాస్ రుక్మిణి సినిమా కోసం యంగ్ లుక్‌లోకి మారిపోయారు నితిన్. అతడి పాత్రకు సంబంధించిన కొత్త లుక్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. ఇందులో నూనూగు మీసాలతో కుర్రాడిలా నితిన్ కనిపిస్తోన్నారు. అలియాస్ రుక్మిణి మూవీకి హీరో నాని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్నారు.
Entertainment | Published On Nov 7, 2026, 3.53 pm IST
Nithiin | టాలీవుడ్ హీరోలు నితిన్, నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న అలియాస్ రుక్మిణి మూవీ నుంచి సర్‌ప్రైజ్ అప్‌డేట్ వచ్చేసింది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు దండోరా ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అఫీయా సయ్యద్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలియాస్ రుక్మిణితోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
రచయిత...
అలియాస్ రుక్మిణి మూవీలో కృష్ణ అనే రచయిత పాత్రలో నితిన్ నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్‌ను రివీల్ చేశారు. ఇందులో కాలేజీ స్టూడెంట్‌గా మరో యంగ్ లుక్‌లో నితిన్ కనిపించబోతున్నాడు. ఈ కొత్త లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఇందులో క్లాస్ రూమ్‌లో బెంచ్‌పై కూర్చొని నూనూగు మీసాల కుర్రాడిగా నితిన్ కనిపిస్తోన్నారు. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
డిసెంబర్ 4న...
అలియాస్ రుక్మిణి మూవీకి హీరో నాని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. నాని సోదరి దీప్తి ఘంటా నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ డిసెంబర్ 4న థియేటర్లలోకి రాబోతుంది. షూటింగ్ పూర్తయ్యింది. కేవలం మూడు నెలల్లోనే చిత్రీకరణ మొత్తం పూర్తిచేసేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Surekha Vani | సురేఖా వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ – అడ్వాంటేజ్ తీసుకోవద్దంటూ వార్నింగ్
నవంబర్ 7, 2026

Bigg Boss | భయపెట్టబోతున్న బిగ్‌బాస్ విన్నర్ – హారర్ కామెడీ మూవీతో హీరోగా ఎంట్రీ
నవంబర్ 6, 2026

Anaswara Rajan | చిరంజీవి, రవితేజ సినిమాల్లో ఆఫర్స్ – మలయాళ బ్యూటీ రియాక్షన్
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Reliance Jio | జియో నుంచి 3 ఏళ్ల రీచార్జ్ ప్లాన్.. 2,700 జీబీ డేటా..
- ●MLC Dasoju Sravan | రేవంత్! గురుకుల బెడ్‌షీట్స్‌ను కోటు కుట్టించుకో.. తెలుస్తది
- ●BYD | చైనా ఎలక్ట్రిక్ కార్ @ 500 కి.మీ. వేగం.. సరికొత్త ప్రపంచ రికార్డు..
- ●Air Pollution | WFH నిబంధనలు పాటించలేదని.. రెండు సంస్థలకు నోటీసులు
- ●IAF | లడఖ్‌లో చరిత్ర సృష్టించిన ఐఏఎఫ్..
- ●CoinDCX | క్రిప్టో సంస్థలకు ఈడీ షాక్.. కాయిన్ డీసీఎక్స్, డెల్టా ఎక్స్ఛేంజ్పై దర్యాప్తు..

Reliance Jio | జియో నుంచి 3 ఏళ్ల రీచార్జ్ ప్లాన్.. 2,700 జీబీ డేటా..

MLC Dasoju Sravan | రేవంత్! గురుకుల బెడ్‌షీట్స్‌ను కోటు కుట్టించుకో.. తెలుస్తది

BYD | చైనా ఎలక్ట్రిక్ కార్ @ 500 కి.మీ. వేగం.. సరికొత్త ప్రపంచ రికార్డు..

Air Pollution | WFH నిబంధనలు పాటించలేదని.. రెండు సంస్థలకు నోటీసులు



