OTT | కరీనా కపూర్ వర్సెస్ ప్రీతీ జింటా – ఒకే రోజు ఓటీటీలోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల సినిమాలు
కరీనా కపూర్, ప్రీతి జింటా హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి రాబోతున్నాయి. నవంబర్ 13 నుంచి కరీనా కపూర్ డైరా నెట్‌ఫ్లిక్స్‌లో...ప్రీతి జింటా వైబ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.
Entertainment | Published On Nov 7, 2026, 6.49 pm IST
OTT | బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కరీనాకపూర్, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు ఒకే రోజు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోహీరోయిన్లుగా నటించిన డైరా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. హైదరాబాద్‌లో జరిగిన దిశా ఎన్‌కౌంటర్ ఘటన ఆధారంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మేఘనా గుల్జార్ ఈ బాలీవుడ్ సినిమాను తెరకెక్కించారు. యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో పది కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. కరీనా కపూర్ కెరీర్‌లో అతి తక్కువ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా చెత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
డైరా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. రాగిణి అనే యువతి హత్యాచారానికి గురవుతుంది. ఈ కేసులో నిందితులను డీసీపీ రామన్ కుమార్ ఎన్‌కౌంటర్ చేస్తారు. ఈ ఎన్‌కౌంటర్‌పై అజూనీ కోహ్లి విచారణ చేపడుతుంది. ఆ విచారణలో ఏం తేలిసింది? రామన్ కుమార్, కోహ్లి సిద్ధాంతాల్లో ఎవరి వైపు నిజం ఉందన్నదే ఈ మూవీ కథ.
అమెజాన్ ప్రైమ్...
డైరాతో పాటు అదే రోజు ప్రీతి జింటా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ వైబ్ కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ యాక్షన్ కామెడీ మూవీ నవంబర్ 13న అమెజాన్ ప్రైమ్ విడుదల కాబోతుంది. వైబ్ సినిమాలో కునాల్ కేము, స్పర్ష్ శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించారు.
ప్రీతి జింటా...
ఈ సినిమాలో గూఢచారిగా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో ప్రీతి జింటా నటించింది. ఓ ఇద్దరు సాధారణ యువకులు దేశాన్ని కాపాడే ఓ సీక్రెట్ మిషన్‌లో ఎలా భాగమయ్యారనే కాన్సెప్ట్‌తో వైబ్ మూవీ రూపొందింది. హీరోగా నటించిన కునాల్ కేము ఈ సినిమాకు దర్శకుడిగా, ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

The Traitors Telugu | ది ట్రైటర్స్ తెలుగు సీజన్ వన్ విన్నర్ ఎవరంటే? – ఇద్దరికి దక్కిన ప్రైజ్‌మనీ
నవంబర్ 6, 2026

Tamannaah | సూర్యాస్తమయం తర్వాత అడవిలో ఆడుగుపెడితే మరణమే – సైలెంట్‌గా ఓటీటీలోకి తమన్నా హారర్ మూవీ
నవంబర్ 6, 2026

OTT | ఇదేం ట్విస్ట్…800 కోట్ల బ్లాక్‌బస్టర్ – రిలీజై నెలకాకముందే ఓటీటీలోకి…
నవంబర్ 5, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | పదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదు
- ●Suicide attempt | శ్రీనివాసరావు వల్లనే సచ్చిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- ●Telugu Serial | జీ తెలుగులో కొత్త సీరియల్ - హీరోయిన్గా కోలీవుడ్ బ్యూటీ
- ●Medak RTC RM | డీఎం తప్పు లేదు.. కార్మిక సంఘాల ఆరోపణలే అబద్ధం: మెదక్ ఆర్ఎం
- ●Koppula Eshwar | సీఎం, మంత్రుల ప్రచారం వల్లే పంటలు ఎండిపోతున్నయ్
- ●Balu Geetha Movie Review | బాలు గీత రివ్యూ - నాగార్జున మేనకోడలు నిర్మించిన రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?

CM Revanth Reddy | పదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదు

Suicide attempt | శ్రీనివాసరావు వల్లనే సచ్చిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Telugu Serial | జీ తెలుగులో కొత్త సీరియల్ - హీరోయిన్గా కోలీవుడ్ బ్యూటీ

Medak RTC RM | డీఎం తప్పు లేదు.. కార్మిక సంఘాల ఆరోపణలే అబద్ధం: మెదక్ ఆర్ఎం



