Comedy OTT | ఓటీటీలోకి సురేఖావాణి కూతురు క్రైమ్ కామెడీ మూవీ – లాయర్ పుష్పగా మంచు లక్ష్మి….
మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, సుప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ లేచింది మహిళా లోకం ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యింది. ఏప్రిల్ 22 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Apr 18, 2026, 10.54 am IST
Comedy OTT | మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ లేచింది మహిళా లోకం ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. కార్తీక్ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురేఖవాణి కూతురు సుప్రితతో పాటు శ్రద్ధా దాస్, హేమ, హరితేజ, శ్రీరామచంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజైన విషయం ఆడియెన్స్‌కు తెలిసేలోపే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. ఈ డిజాస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 22 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో లేచింది మహిళా లోకం స్ట్రీమింగ్ కాబోతుంది.
పురుషాధిక్యత...
సమాజంలోని పురుషాధిక్యత, మహిళలపై వివక్ష, భార్యభర్తల మధ్య ఈగో సమస్యలాంటి అంశాలను వినోదాత్మకంగా ఈ సినిమాలో చెప్పారు దర్శకద్వయం. నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు ఈ సినిమాకు చాలా మంది మహిళలే పనిచేశారు. కానీ కమర్షియల్‌గా మాత్రం లేచింది మహిళా లోకం సరైన విజయాన్ని అందుకోలేకపోయింది.
మర్డర్ ప్లాన్...
ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త తనను పట్టించుకోవడం లేదని ఓ మహిళా అసంతృప్తితో అంటుంది. అదే టైమ్‌లో అమెకు ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉంటే నలుగురు మహిళలు పరిచయం అవుతారు. వారి కారణంగా భార్యభర్తల మధ్య గొడవలు మరింత పెరుగుతాయి. మగాళ్లను వారందరూ ద్వేషించడానికి కారణం ఏమిటి? వారి గొడవలోకి లాయర్ పుష్ప ఎలా వచ్చింది? ఈ ఆరుగురు కలిసి ఎవరిని మర్డర్ చేయాలని అనుకున్నారు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



