Sunny Leone | సన్నీలియోన్‌కు సాధువుల వార్నింగ్ – కారణమిదే?
బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు మథుర లోని హిందూ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. న్యూ ఇయర్ సందర్భంగా మథురలో సన్నీలియోన్ ఓ ఈవెంట్ చేయాల్సింది. కానీ హిందూ సంఘాలతో పాటు సాధువులు మథురలో సన్నీలియోన్ అడుగుపెట్టడానికి వీలులేదంటూ డిమాండ్ చేస్తున్నారు.
Entertainment | Published On Dec 30, 2025, 7.35 pm IST
సంక్షిప్త సారాంశం
Sunny Leone, Bollywood Beauty, Mathura , Saints, New Year
Sunny Leone | బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్‌కు హిందూ సంఘాలతో పాటు సాధువులు షాకిచ్చారు. ఈ బాలీవుడ్ బ్యూటీ పేరు చెబితేనే ఫైర్ అవుతున్నారు. అవసరమైతే పోలీస్ కంప్లైట్ ఇవ్వడానికి రెడీ అంటూ సన్నీలియోన్‌కు వార్నింగ్ ఇచ్చారు. సన్నీలియోన్‌పై సాధువులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి వెనుక ఓ కారణం ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఓ ఈవెంట్ ఆర్గనైజర్స్ సన్నీలియోన్‌తో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారట. ట్రంక్ హోటల్‌లో గ్రాండ్‌గా జరుగనున్న ఈ షోకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయట. సన్నీలియోన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట.
ఈ సన్నీలియోన్ షోకు మథురలోని సాధువుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సన్నీలియోస్ మథురలో అడుగుపెట్టడానికి వీలు లేదంటూ హిందూ సంఘాలతో కలిసి వందలాది మంది సాధువులు నిరసనకు దిగారు. సన్నీలియోన్ షోను క్యాన్సిల్ చేయాలంటూ డిమాండ్ చేశారు. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథురలో ఇలాంటి అసభ్యకరమైన షోలను నిర్వహించడానికి వీలు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసనలతో ఆగిపోకుండా జిల్లా మెజిస్ట్రేటుకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీకృష్ణుడు నడయాడిన ఈ పవిత్ర స్థలంలో సన్నీలియోన్ షోలను నిర్వహించడానికి వీలు లేదంటూ ఇందులో పేర్కొన్నారు. అవసరమైతే సన్నీలియోన్‌తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి సిద్ధమంటూ పేర్కొన్నారు. సాధువుల నిరసనతో ఈవెంట్ ఆర్గనైజర్స్ దిగొచ్చినట్లు సమాచారం. సన్నీలియోన్ షోను క్యాన్సిల్ చేశారట.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



