త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sunny Leone | రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి స‌న్నీ లియోన్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – స్లీపింగ్ డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డే కిల్ల‌ర్ క‌థ‌

స‌న్నీలియోన్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ కెన‌డీ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 20 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Feb 9, 2026, 2.28 pm IST

Sunny Leone | రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి స‌న్నీ లియోన్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – స్లీపింగ్ డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డే కిల్ల‌ర్ క‌థ‌
Advertisement

Sunny Leone | థియేట్రిక‌ల్‌, ఓటీటీ రిలీజ్ మ‌ధ్య గ్యాప్ రాను రాను త‌గ్గిపోతుంది. అగ్ర హీరోలు న‌టించిన సినిమాలు థియేట‌ర్లలో విడుద‌లై రెండు, మూడు వారాల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద గ‌నక సినిమా ఫ్లాప్ అయితే వారం, ప‌ది రోజుల్లోనే ఓటీటీలో ఆ సినిమా క‌నిపిస్తోంది. కానీ స‌న్నీలియోన్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ కెన‌డీ మాత్రం థియేట‌ర్ల‌లో విడుద‌లైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతుంది.
కెన‌డీ మూవీకి అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో స‌న్నీలియోన్‌తో పాటు రాహుల్ భ‌ట్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

జీ5 ఓటీటీలో...

2023లో కేన్స్‌తో పాటు ప‌లు ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో కెన‌డీ మూవీని స్క్రీనింగ్ అయ్యింది. తాజాగా కెన‌డీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 20న జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన స‌న్నీలియోన్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. కేవ‌లం హిందీలో మాత్ర‌మే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇందులో స‌న్నీలియోన్ గూఢ‌చారిగా క‌నిపించింది. త‌క్కువ డైలాగ్స్‌లో క‌ళ్ల‌తోనే హావ‌భావాలు ప‌లికిస్తూ త‌న పాత్ర‌ను డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్‌ డిఫ‌రెంట్‌గా తీర్చిదిద్దాడ‌ని ప్ర‌మోష‌న్స్‌లో స‌న్నీలియోన్ చెప్పింది.

సైకో కిల్ల‌ర్‌...

సైకో కిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఈ సినిమాను రూపొందించారు. ఉద‌య్ శెట్టి (రాహుల్ భ‌ట్‌) ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. ఓ సీక్రెట్ ఆప‌రేష‌న్‌లో అత‌డు చ‌నిపోయిన‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. కానీ కెన‌డీగా పేరు మార్చుకున్న ఉద‌య్ కాంట్రాక్ట్‌ కిల్ల‌ర్‌గా మారుతాడు. పోలీస్‌స్ ఆఫీస‌ర్‌గా తాను చేసిన త‌ప్పుల‌ను కిల్ల‌ర్‌గా ఎలా స‌రిదిద్దాడు?
కెన‌డీకి ఉన్న మాన‌సిక స‌మ‌స్య ఏమిటి? కెన‌డీ లైఫ్‌లోకి వ‌చ్చిన ఛార్లీ (స‌న్నీ లియోన్‌) ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

తెలుగులో....

అగ్లీ, దోబారా త‌ర్వాత అనురాగ్ క‌శ్య‌ప్‌, స‌న్నీలియోన్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూడో సినిమా ఇది. ప్ర‌స్తుతం స‌న్నీలియోన్ బాలీవుడ్‌లోనే కాకుండా ద‌క్షిణాదిలో సినిమాలు చేస్తోంది. ఇటీవ‌లే త్రిముఖ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ప్ర‌స్తుతం రంగీలా అనే మ‌ల‌యాళ మూవీతో హిందీలో రెండు సినిమాలు చేస్తోంది.

Advertisement
Advertisement