త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Border 2 Teaser | 150 కోట్ల‌తో సీక్వెల్ – బోర్డ‌ర్ 2 టీజ‌ర్ రిలీజ్ – యాక్ష‌న్ సీన్లు గూస్‌బంప్స్!

Border 2 Teaser | ఇండియ‌న్ వార్ డ్రామా మూవీస్‌లో క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచిన బోర్డ‌ర్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. బోర్డ‌ర్ 2 పేరుతో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో స‌న్నీ డియోల్‌, వ‌రుణ్ ధావ‌న్‌, ద‌ల్జీత్ దొసాంజా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. బోర్డ‌ర్ 2 టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Dec 16, 2025, 5.26 pm IST

Border 2 Teaser |  150 కోట్ల‌తో సీక్వెల్ – బోర్డ‌ర్ 2 టీజ‌ర్ రిలీజ్ – యాక్ష‌న్ సీన్లు గూస్‌బంప్స్!

బోర్డ‌ర్ 2

Advertisement

Border 2 Teaser |  1997లో వ‌చ్చిన బాలీవుడ్ (Bollywood) మూవీ బోర్డ‌ర్‌ ఇండియ‌న్ వార్ డ్రామా సినిమాల్లో క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. 1971 ఇండియా - పాకిస్థాన్ యుద్దం నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమాకు ఆడియెన్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మూడు జాతీయ అవార్డుల‌తో పాటు అనేక పుర‌స్కారాల‌ను ద‌క్కించుకుంది. ఇండియ‌న్ ఆర్మీ ధైర్య‌సాహ‌సాల‌ను, పోరాట ప‌ఠిమ‌ను స్ఫూర్తిదాయ‌కంగా ఆవిష్క‌రించిన సినిమాగా బోర్డ‌ర్ నిలిచింది.
దాదాపు 28 లాంగ్ గ్యాప్ త‌ర్వాత బోర్డ‌ర్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. బోర్డ‌ర్ 2 (Border 2)టైటిల్‌తో రూపొందుతున్న ఈ సీక్వెల్ కు అనురాగ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బోర్డ‌ర్‌లో ఓ క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ స‌న్నీ డియోల్ (Sunny Deol) ఈ సీక్వెల్‌లో మెయిన్ హీరోగా న‌టిస్తోన్నాడు. అత‌డితో పాటు యంగ్ హీరోలు వ‌రుణ్ ధావ‌న్‌, ద‌ల్జీత్ దొసాంజా, అహాన్ శెట్టి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
బోర్డ‌ర్ 2 టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా టీజ‌ర్ సాగింది. ఆర్మీతో పాటు ఎయిర్‌ఫోర్స్‌, నావీ...త్రివిధ ద‌ళాల పోరాట స్ఫూర్తిని గూస్‌బంప్స్ క‌లిగించేలా టీజ‌ర్‌లో చూపించారు. కేవ‌లం యుద్ద అంశాల‌కు ప‌రిమితం కాకుండా సైనికుల వ్య‌క్తిగ‌త జీవితాల్లోని ఎమోష‌న్స్‌ను హృద్యంగా టీజ‌ర్‌లో ఆవిష్క‌రించారు.
స‌న్నీ డియోల్ స్క్రీన్ ప్ర‌జెన్స్‌, డైలాగ్స్ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. బోర్డ‌ర్ 2లో స‌న్నీ డియోల్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌నున్న‌ట్లు టీజ‌ర్ ద్వారా చెప్పేశారు. వ‌రుణ్ ధావ‌న్‌తో పాటు ద‌ల్జీత్ దోసాంజా, అహాన్ శెట్టి పాత్ర‌లు సీరియ‌స్‌గా సాగాయి. ఎవ‌రికి వారే పోటీప‌డి న‌టించారు. వార్ బ్యాక్‌డ్రాప్ సీన్లు ఆస‌క్తిని పంచుతున్నాయి. ఫ్యాన్స్ నుంచి ఈ టీజ‌ర్‌కు పాజిటివ్ కామెంట్స్ వ‌స్తున్నాయి. రియ‌లిస్టిక్‌గా సీన్లు, స్ట్రాంగ్ ఎమోష‌న్స్‌తో టీజ‌ర్ ఆక‌ట్టుకుంటుంద‌ని కామెంట్స్ పెడుతున్నారు.
బోర్డ‌ర్ 2 మూవీ రిప‌బ్లిక్ డే కానుక‌గా 2026 జ‌న‌వ‌రి 23న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. దాదాపు 150 కోట్ల‌తో భూష‌ణ్‌కుమార్‌, క్రిష‌న్ కుమార్‌ల‌తో క‌లిసి బోర్డ‌ర్ డైరెక్ట‌ర్ జేపీ ద‌త్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోనా సింగ్‌, సోన‌మ్ బ‌జ్వా, అన్య సింగ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement