త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suma Kanakala | యాంక‌ర్ సుమ‌కు షాక్ – స‌డెన్‌గా ఆగిపోయిన తెలుగు టాక్‌ షో

టాలీవుడ్ టాప్ యాంక‌ర్ సుమ క‌న‌కాల‌కు ఈటీవీ ఛానెల్ పెద్ద షాకిచ్చింది. సుమ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న టాక్ షో సుమ అడ్డాను అర్ధాంత‌రంగా ఆపేసిన‌ట్లు స‌మాచారం. సుమ అడ్డా షో ఆగిపోవ‌డంపై ఫ్యాన్స్ డిస‌పాయింట్ అవుతోన్నారు.

N

Entertainment | Published On Apr 11, 2026, 4.59 pm IST

Suma Kanakala | యాంక‌ర్ సుమ‌కు షాక్ – స‌డెన్‌గా ఆగిపోయిన  తెలుగు టాక్‌ షో
Advertisement

Suma Kanakala | టాలీవుడ్‌లో టాప్ యాంక‌ర్‌గా కొన‌సాగుతోంది సుమ క‌న‌కాల‌. తెలుగులో చాలా మందే యాంక‌ర్లు ఫేమ‌స్ అయినా ఎవ‌రూ సుమ‌ను మాత్రం బీట్ చేయ‌లేక‌పోయారు. సుమ లేకుండా స్టార్ హీరోల సినిమాల ప్ర‌మోష‌న్స్ ఉండ‌వంటే అతిశ‌యోక్తి కాదు. ప్రీ రిలీజ్ , స‌క్సెస్ మీట్ మొద‌లుకొని స్టార్ హీరోల ఇంట‌ర్వ్యూల వ‌ర‌కు ప్ర‌తి వేడుక‌లో సుమ ఉండాల్సిందే. ఓ వైపు సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటూనే కొన్ని తెలుగు టీవీ షోస్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది సుమ క‌న‌కాల‌.

మెగాస్టార్ చిరంజీవి....

సుమ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న పాపుల‌ర్ టీవీ షోస్‌లో సుమ అడ్డా ఒక‌టి. ఈటీవీలో ఈ ఫ‌న్ టాక్ షో టెలికాస్ట్ అవుతోంది. 2023లో మొద‌లైన సుమ అడ్డా షోకు మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌లువురు టాలీవుడ్‌, కోలీవుడ్ హీరోలు, హీరోయిన్లు గెస్ట్‌లుగా వ‌చ్చారు. టీఆర్‌పీ ప‌రంగా ఈటీవీ షోస్‌లో సుమ అడ్డా టాప్‌లో నిలుస్తూ వ‌చ్చింది. మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ షోకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

సుడిగాలి సుధీర్ షో కూడా...

తాజాగా సుమ అడ్డా టాక్ షోను అర్ధాంత‌రంగా నిలిపివేశారు మేక‌ర్స్‌. ఇక నుంచి ఈటీవీలో ఈ షో టెలికాస్ట్ కాద‌ట‌. సుమ అడ్డాను నిలిపివేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు. టీఆర్‌పీలో టాప్‌లో ఉన్న షోను ఆపేయ‌డంపై ఫ్యాన్స్ డిస‌పాయింట్ అవుతున్నారు. సుమ అడ్డాను మిస్స‌వుతామంటూ కామెంట్స్ పెడుతోన్నారు. సుమ అడ్డా ప్లేస్‌లో మ‌రో ఫ‌న్ టాక్ షోను లాంఛ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ షోకు సుమ‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తారా? యాంక‌ర్‌ను మార్చేస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
సుమ అడ్డాతో పాటు సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఫ్యామిలీ స్టార్స్ షోకు కూడా ఈటీవీ గుడ్‌బై చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Advertisement