Tv Show | ఆషు రెడ్డి, స్రవంతితో సుధీర్ డబుల్ ధమాకా – కొత్త టైమింగ్స్ తో ఫ్యామిలీ స్టార్స్ 2 – రెమ్యూనరేషన్ ఎంతంటే?
కొంత గ్యాప్ తర్వాత సుడిగాలి సుధీర్ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2కు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ సెలిబ్రిటీ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ మరదళ్లుగా స్రవంతి చొక్కారపు, ఆషురెడ్డి కనిపించనున్నారు. ఫ్యామిలీ స్టార్స్ లాంఛ్ డేట్‌తో పాటు టెలికాస్ట్ టైమింగ్స్‌ను ఈటీవీ వెల్లడించింది.
Entertainment | Published On Jul 21, 2026, 12.51 pm IST
Tv Show | తెలుగు బుల్లితెరపై టాప్ హోస్ట్‌లలో ఒకరిగా కొనసాగుతోన్నాడు సుడిగాలి సుధీర్. జబర్ధస్థ్ కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ ఆ తర్వాత హోస్ట్‌గా మారారు. శ్రీదేవి డ్రామా కంపెనీ, పోవే పోరా, సర్కార్‌తో పాటు పలు టీవీ, ఓటీటీ పాపులర్ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరించి అభిమానులను ఆకట్టుకున్నాడు. సినిమాల కారణంగా టీవీ షోస్‌కు కొంత గ్యాప్ ఇచ్చిన సుధీర్ మళ్లీ సక్సెస్‌ఫుల్ టీవీ షో సెకండ్ సీజన్‌తో బుల్లితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
కామెడీ టైమింగ్....
ఈటీవీలో టెలికాస్ట్ అయిన ఫ్యామిలీ స్టార్స్ షో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సెలిబ్రిటీ కామెడీ షోకు హోస్ట్‌గా సుధీర్ కనిపించాడు. కామెడీ టైమింగ్, పంచ్‌లతో సుధీర్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ స్టార్స్‌కు సెకండ్ సీజన్ రాబోతుంది.
ప్రోమో రిలీజ్...
ఫ్యామిలీ స్టార్స్ 2 లాంఛ్ డేట్‌తో పాటు టైమింగ్స్‌ను ఈటీవీ రివీల్ చేసింది. జూలై 26 నుంచి ఫ్యామిలీ స్టార్స్ 2 మొదలుకాబోతున్నట్లు ప్రకటించింది. ప్రతి ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు ఈ షోను టెలికాస్ట్ కానున్నట్లు వెల్లడించింది. ఓ కొత్త ప్రోమోను రిలీజ్ చేసింది.
మరదళ్లుగా....
ఈ ప్రోమోలో సుధీర్ మరదళ్లుగా స్రవంతి చొక్కారపు, ఆషురెడ్డి కనిపించబోతున్నట్లు ప్రకటించారు. సెకండ్ సీజన్ లాంఛ్ ఎపిసోడ్‌కు బిగ్‌బాస్ ద్వారా ఫేమస్ అయిన అర్జున్ అంబలి, నిఖిల్, యష్మి, ప్రియాంక, తేజస్విని గౌడ రాబోతున్నట్లు చూపించారు. వారితో పాటు హీరోయిన్ సీరత్ కపూర్ కూడా ఈ షోలో సందడి చేసినట్లుగా చూపించారు.
రెమ్యూనరేషన్...
ఫ్యామిలీ స్టార్స్ 2 కోసం సుధీర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్‌కు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు పారితోషికంగా సుధీర్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. స్రవంతి చొక్కారపు, ఆషురెడ్డిలకు ఒక్కో ఎపిసోడ్‌కు నలభై వేల నుంచి అరవై వేల వరకు రెమ్యూనరేషన్ దక్కనున్నట్లు తెలిసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tamil OTT | తెలుగులో రిలీజైన తమిళ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ – ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
సెప్టెంబర్ 10, 2026

Ott Releases This Week | ఈ వారం ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఒక్కోటి ఒక్కో జానర్
ఆగస్టు 28, 2026

Thriller OTT | నెల రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ – కర్మ సిద్ధాంతం కథతో….
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..
- ●Harish Rao | 8.4 టీఎంసీల నీరున్నా ఎందుకు మనసొస్తలేదు రేవంత్?
- ●Revanth Reddy Sircilla Public Meeting | గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట
- ●Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు
- ●Delhi | ఢిల్లీలో మరో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి ఆరోతరగతి బాలికపై లైంగిక దాడి
- ●Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్

Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..

Harish Rao | 8.4 టీఎంసీల నీరున్నా ఎందుకు మనసొస్తలేదు రేవంత్?

Revanth Reddy Sircilla Public Meeting | గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట

Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు



