త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | టాలీవుడ్ హీరోతో భాగ్య‌శ్రీ బోర్సే సీక్రెట్ ల‌వ్‌స్టోరీ – హింట్ ఇచ్చేసిన యాంక‌ర్ సుమ

టాలీవుడ్ హీరో రామ్ పోతినేనితో హీరోయిన్ భాగ్య‌శ్రీ బోర్సే ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా గ‌త కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. హైద‌రాబాద్ త‌న సెకండ్ హోమ్‌టౌన్ అని, ఇక్క‌డ ఆల్రెడీ త‌న‌కు ఓ ఇళ్లు ఉందంటూ లెనిన్ ప్ర‌మోష‌న్స్‌లో భాగ్య‌శ్రీ అన్న‌ది. ఆమె కామెంట్ల‌కు మీరు హైద‌రాబాద్‌లోని సెటిల‌వ్వాల‌ని కోరుకుంటున్నానంటూ సుమ క‌న‌కాల ఫ‌న్నీ కామెంట్స్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Jun 21, 2026, 3.32 pm IST

Bhagyashri Borse | టాలీవుడ్ హీరోతో భాగ్య‌శ్రీ బోర్సే సీక్రెట్ ల‌వ్‌స్టోరీ – హింట్ ఇచ్చేసిన యాంక‌ర్ సుమ
Advertisement

Bhagyashri Borse |  తెలుగులో స‌క్సెస్‌లు లేక‌పోయినా అవ‌కాశాలు రేసులో మాత్రం భాగ్య‌శ్రీ బోర్సే ముందుంటోంది. బ్యాక్ టూ బ్యాక్‌ స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోంది. భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టించిన లెనిన్ జూలై 10న రిలీజ్ కాబోతుంది. అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఈ సినిమాలో రాయ‌ల‌సీమ యువ‌తిగా ఈ టాలీవుడ్ హీరోయిన్ క‌నిపించ‌బోతుంది. లెనిన్ ప్ర‌మోష‌న్స్‌లో భాగ్య‌శ్రీ బిజీగా ఉంది.

టాలీవుడ్ హీరోతో...

కాగా టాలీవుడ్ హీరో రామ్ పోతినేనితో భాగ్యశ్రీ బోర్సే ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రు క‌లిసి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేశారు. ఈ షూటింగ్‌లోనే రామ్ పోతినేనితో భాగ్య‌శ్రీకి ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని త‌మ ల‌వ్‌స్టోరీని సీక్రెట్‌గా దాస్తున్నార‌ట‌. ఇటీవ‌లే రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అత‌డికి స్పెష‌ల్‌గా భాగ్య‌శ్రీ బోర్సే విషెస్ చెప్పింది. ఆ మ‌ధ్య కాంత హీరోయిన్ చేతికి ఓ ఉంగ‌రం క‌నిపించ‌డం కూడా ఆస‌క్తిని రేకెత్తించింది. అది ఎంగేజ్‌మెంట్ రింగ్ అంటూ వార్త‌లొచ్చాయి. సీక్రెట్‌గా టాలీవుడ్ హీరోతో భాగ్య‌శ్రీ ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగిందంటూ పుకార్లు వ‌చ్చాయి.

హైద‌రాబాద్‌...

కాగా భాగ్య‌శ్రీ ర‌హ‌స్య ప్రేమాయ‌ణంపై లెనిన్ ప్ర‌మోష‌న్స్‌లో యాంక‌ర్ సుమ క‌న‌కాల హింట్ ఇచ్చేసింది. ఇన్‌డైరెక్ట్‌గా భాగ్య‌శ్రీ హైద‌రాబాద్ కోడ‌లు కాబోతుందంటూ కామెంట్స్ చేసింది. లెనిన్ ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో ఔరంగ‌బాద్ కాకుండా మీ హౌమ్‌టౌన్ అంటే ఏ సిటీ పేరు చెబుతారు అని భాగ్య‌శ్రీని సుమ క‌న‌కాల అడిగింది. హైద‌రాబాద్ నా సెకండ్ హోమ్‌టౌన్. అల్రెడీ ఇక్క‌డ నాకు ఇళ్లు ఉంది అని స‌మాధాన‌మిచ్చింది. చాలా మంది హైద‌రాబాద్‌లో సెటిల‌వుతున్నారు. మీరు అలాగే అవ్వాల‌ని కోరుకుంటున్నాం. దీని అర్థం ఏమిటో ఎవ‌రికి తెలియ‌దు సుమ అన్న‌ది. రామ్‌, భాగ్య‌శ్రీ ల‌వ్‌స్టోరీ గురించే సుమ క‌న‌కాల ఈ కామెంట్లు చేసింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. ఈ టాలీవుడ్ జంట త్వ‌ర‌లోనే పెళ్లి క‌బురు వినిపించే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు ట్వీట్స్‌, కామెంట్లు పెడుతోన్నారు.

శివ‌కార్తికేయ‌న్‌...

ప్ర‌స్తుతం త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్‌తో సియోన్ సినిమా చేస్తోంది భాగ్య‌శ్రీ బోర్సే. విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌రోవైపు రామ్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోన్నారు. ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా చేస్తోన్నాడు.

Advertisement
Advertisement