Anupama Parameswaran | బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా – యాంకర్ ప్రశ్నకు వెరైటీగా సమాధానం చెప్పిన అనుపమ పరమేశ్వరన్
కోలీవుడ్ హీరో ధృవ్ విక్రమ్‌తో బ్రేకప్ తర్వాత సినిమాలకు కాకుండా ఓ తెలుగు టీవీ షోకు అనుపమ పరమేశ్వరన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఢీ డ్యాన్స్ షో సీజన్ 21కు జడ్జ్‌గా వ్యవహరించబోతుంది. ఈ డ్యాన్స్ షో ప్రోమో గురువారం రిలీజైంది. ఈ ప్రోమోలో బాయ్‌ఫ్రెండ్‌పై అనుపమ పరమేశ్వరన్ వెరైటీ కామెంట్లు చేసింది.
Entertainment | Published On Sep 17, 2026, 7.30 pm IST
Anupama Parameswaran | కోలీవుడ్ హీరో ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ ప్రేమకు ఇటీవలే బ్రేకప్ పడింది. విభేదాలతో విడిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ధృవ్ విక్రమ్‌పై అనుపమ చేసిన ఆరోపణలు, కామెంట్లు దక్షిణాది సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపాయి. ధృవ్‌ను చాలా మందే ట్రోల్ చేశారు.
జడ్జ్‌గా...
లవ్ బ్రేకప్ తర్వాత అనుపమ సినిమాలు కాకుండా ఓ టీవీ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా తెలుగులో. ఢీ డ్యాన్స్ షో సీజన్ 21కు అనుపమ జడ్జ్‌గా వ్యవహరించబోతుంది. ఆమెతో పాటు టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరో జడ్జ్‌గా కనిపించనున్నారు.
బాయ్‌ఫ్రెండ్ గురించి...
ఢీ షో సీజన్ 21 ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ షోలో బాయ్‌ఫ్రెండ్ గురించి హోస్ట్ ప్రదీప్ మాచిరాజు అడిగిన ప్రశ్నకు అనుపమ ఇచ్చిన ఆన్సర్ వైరల్ అవుతోంది. అల వైకుంఠపురములో సినిమాలోని సామజవరగమనా సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ ఈ షోలోకి అనుపమ ఎంట్రీ ఇచ్చినట్లుగా ప్రోమోలో కనిపించింది. అనుపమను చూపిస్తూ "ఢీ కాలేజీకి జూనియర్ వచ్చారు...సీనియర్స్ ఇక్కడ" అంటూ ప్రదీప్ డైలాగ్ కొట్టాడు. అతడి పంచ్‌కు "ఎప్పుడు వచ్చాము అన్నది కాదు అన్నయ్య...ఎంటర్‌టైన్‌మెంట్ చేశామా లేదా అన్నదే ముఖ్యం" అని అనుపమ బదులిచ్చింది.
బాయ్‌ఫ్రెండ్...
"ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ...మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా" అంటూ అనుపమను ప్రదీప్ అడిగాడు. నీకెందుకు అని అనుపమ సీరియస్‌గా సమాధానం ఇచ్చింది. "బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు అంటే నా షో నేను చేసుకుంటా...లేడంటే నీతో షో చేస్తాను" అని చెప్పి ప్రదీప్ నవ్వించాడు. "ఇప్పుడే కలిశాం. అప్పుడే ఫర్ట్ చేస్తావా" అంటూ మైక్‌తో సరదాగా ప్రదీప్‌ను కొట్టింది అనుపమ. ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
ఢీ సీజన్ 21 సెప్టెంబర్ 19న లాంఛ్ కాంబోతుంది. నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ ఓటీటీతో పాటు ఈటీవీలో ఈ షో టెలికాస్ట్ కాబోతుంది. అనుపమ జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న ఫస్ట్ టీవీ షో ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ తెలుగులో భోగీ, క్రేజీ కళ్యాణం సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.
The Double Impact is here! 🔥💥
Dhee 21 – Double Impact premieres September 19 at 21:21 (9:21 PM IST). 🕘
First episode FREE on @etvwin. ❤️
A WIN Original Show pic.twitter.com/DlcOa4k5rM
— ETV Win (@etvwin) September 16, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ – ఫస్ట్ నైట్ రోజే ప్రియుడితో పెళ్లికూతురు జంప్
సెప్టెంబర్ 14, 2026

Irumudi OTT | అఫీషియల్ – థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి – నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
సెప్టెంబర్ 13, 2026

Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం – దిగొచ్చిన ధృవ్ విక్రమ్
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●భూముల రగడ బంతి మళ్లీ రేవంత్ కోర్టులో.. సీఎం ముందున్న ఐదు ప్రశ్నలు ఇవే !
- ●Minister Ponguleti | కేటీఆర్ భూసామ్రాజ్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్
- ●Sreeleela | సినిమాలు లేకపోయినా సంపాదనలో శ్రీలీల తగ్గేదేలే
- ●Chamala Kiran Kumar Reddy | ఆ ఆస్తులు మీ తాతలిచ్చినవేనా?
- ●Vaishnavi's Husband Murdered | యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. దుండగులు ఎలా చంపారంటే..
- ●Meghamsh Srihari | మిస్టరీ డెత్ కేసుతో శ్రీహరి కొడుకు మూవీ - ట్రెండింగ్‌లో ఆస్మాన్ టీజర్

భూముల రగడ బంతి మళ్లీ రేవంత్ కోర్టులో.. సీఎం ముందున్న ఐదు ప్రశ్నలు ఇవే !

Minister Ponguleti | కేటీఆర్ భూసామ్రాజ్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైర్

Sreeleela | సినిమాలు లేకపోయినా సంపాదనలో శ్రీలీల తగ్గేదేలే

Chamala Kiran Kumar Reddy | ఆ ఆస్తులు మీ తాతలిచ్చినవేనా?



