Telugu Movie | యూట్యూబ్‌లో రిలీజైన సుమ కనకాల తెలుగు కామెడీ మూవీ – ఫ్రీగా స్ట్రీమింగ్
సుమ కనకాల లీడ్ రోల్‌లో నటించిన తెలుగు మూవీ జయమ్మ పంచాయితీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. విలేజ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి విజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Jan 23, 2026, 7.46 pm IST
Telugu Movie | సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ జయమ్మ పంచాయితీ 2022లో థియేటర్లలో రిలీజైంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో దేవిప్రసాద్, దినేష్ కుమార్, షాలిని కొండెపూడి కీలక పాత్రలో నటించారు. జయమ్మ పంచాయితీ మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇచ్చింది సుమ కనకాల. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందించారు.
ఫ్రీ స్ట్రీమింగ్...
తాజాగా జయమ్మ పంచాయితీ మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో విలేజ్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ విజయ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. సుమ కనకాలకు బుల్లితెరపై ఉన్న ఇమేజ్ కారణంగా ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది. లాంగ్ రన్‌లో థియేటర్లలో నిలబడలేకపోయిన ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. జయమ్మ పంచాయితీ తర్వాత మూడేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సుమ కనకాల ఇటీవల ప్రేమంటే సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది.
పంజాయితీ...
జయమ్మది మధ్య తరగతి కుటుంబం. భర్త మంచితనంతో ఆస్తులన్నీ పొగడతాడు. కుటుంబ బాధ్యతలు జయమ్మపై పడతాయి. ఇంతలోనే భర్తకు గుండె జబ్బు ఉందనే నిజం బయటపడుతుంది. ఈ సమస్య నుంచి జయమ్మ ఎలా గట్టెక్కింది? ఊరి ప్రజలను ఆమె పంచాయితీకి పిలవడానికి కారణమేమిటి అన్నదే ఈ మూవీ కథ.
యాంకర్‌గా ఫేమస్...
సినిమాలు తక్కువే చేసిన తెలుగులో టాప్ యాంకర్‌గా సుమ కనకాల కొనసాగుతోంది. స్టార్ హీరో సినిమాల ఈవెంట్స్, ఇంటర్వ్యూలు అంటే యాంకర్‌గా సుమ తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతలా ఆమె పేరు ఫేమస్ అయ్యింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





