Sai Pallavi | సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఓటీటీ రిలీజ్‌లో ట్విస్ట్ – నేరుగా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్!
ఏక్ దిన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సాయిపల్లవి. హిందీ అగ్ర హీరో ఆమిర్‌ఖాన్ నిర్మాతగా రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఏక్‌దిన్ మూవీ ఓటీటీ రిలీజ్‌లోనూ ట్విస్ట్ నెలకొన్నట్లు సమాచారం. ఈ సినిమా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On May 31, 2026, 5.30 pm IST
Sai Pallavi | దక్షిణాదిలో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న సాయిపల్లవికి బాలీవుడ్‌లో తొలి అడుగులోనే నిరాశ ఎదురైంది. ఈ నాచురల్ బ్యూటీ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఏక్ దిన్ డిజాస్టర్‌గా నిలిచింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను అగ్ర హీరో ఆమిర్‌ఖాన్ నిర్మించారు. అతడి కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించాడు. దాదాపు ఇరవై ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ఐదు కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది. ఆమిర్‌ఖాన్‌కు ఇరవై కోట్లకుపైనే నష్టాలను మిగిల్చింది.
మక్కీకి మక్కీ...
ఏక్ దిన్ స్టోరీతో పాటు జునైద్‌ఖాన్, సాయిపల్లవి యాక్టింగ్‌పై కూడా దారుణంగా విమర్శలొచ్చాయి. థాయ్ మూవీ వన్ డేకు రీమేక్‌గా ఏక్ దిన్ రూపొందింది. ఒరిజినల్ వెర్షన్‌ను మక్కీకి మక్కీగా కాపీ కొట్టారంటూ ట్రోల్స్ వచ్చాయి.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ట్విస్ట్ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ కానుందట.
పే ఫర్ వ్యూ...
యూట్యూబ్‌లో పే ఫర్ వ్యూ విధానంలో ఏక్ దిన్ మూవీ జూన్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుందట. యూట్యూబ్ స్ట్రీమింగ్ తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆమిర్‌ఖాన్ భావిస్తున్నారట. ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన సితారే జమీన్ పర్ కూడా ముందుగా యూట్యూబ్‌లో...ఆ తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అదే రూల్‌ను ఏక్ దిన్ విషయంలో ఫాలో కావాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఓటీటీ హక్కులను ఆమిర్ ఖాన్ అమ్మలేదని అంటున్నారు.
ఏక్ దిన్ మూవీకి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఏక్ దిన్ తర్వాత హిందీలో రామాయణ సినిమా చేస్తోంది సాయిపల్లవి. ఈ మైథలాజికల్ మూవీలో సీత పాత్రలో కనిపించబోతున్నది. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణభీర్‌కపూర్ రాముడిగా నటిస్తోన్నది.
సంబంధిత వార్తలు

OTT | తెలుగులో రిలీజైన మలయాళం రొమాంటిక్ లవ్‌స్టోరీ – పేషెంట్‌తో ప్రేమలో పడిన డాక్టర్ కథ
మే 28, 2026

Aamir Khan | టీమిండియా క్రికెటర్ బయోపిక్‌లో ఆమిర్‌ఖాన్ … ఇండియా – పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ బ్యాక్‌డ్రాప్‌లో
మే 28, 2026

Ramayana Release Date | సాయిపల్లవి రామాయణ రిలీజ్ డేట్ ఇదేనా? – అనుకున్నదానికంటే ముందే థియేటర్లలోకి!
మే 25, 2026
తాజావార్తలు
- ●US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!
- ●Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు

US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!

Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్



