Ntr | ఎన్టీఆర్‌కు సర్జరీ – యంగ్ టైగర్ హెల్త్ అప్‌డేట్ వెల్లడించిన టీమ్
డ్రాగన్ షూటింగ్‌లో గాయపడ్డ ఎన్టీఆర్‌కు సర్జరీ జరుగునుంది. బుధవారం కిమ్స్‌లో హాస్పిటల్‌లో డాక్టర్లు ఎన్టీఆర్‌కు సర్జరీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కార్యాలయం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
Entertainment | Published On Aug 11, 2026, 7.59 pm IST
Ntr | డ్రాగన్ షూటింగ్‌లో ఇటీవలే ఎన్టీఆర్ గాయపడ్డారు. ఓ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఆయన భుజానికి గాయమైంది. ఈ గాయానికి ఎన్టీఆర్ సర్జరీ చేయించుకోనున్నారు. ఈ సర్జరీకి సంబంధించి ఎన్టీఆర్ కార్యాలయం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. "వైద్యుల సలహా మేరకు భుజం గాయానికి బుధవారం హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో ఎన్టీఆర్ సర్జరీ చేయించుకోనున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకునే విధంగా వైద్య బృందం చికిత్సను అందిస్తోంది. సర్జరీ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ అప్‌డేట్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తామని" ఎన్టీఆర్ కార్యాలయం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.
రెండు నెలలు దూరం...
భుజం గాయం కారణంగా ఎన్టీఆర్ రెండు నెలల పాటు సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండనున్నారు. సెప్టెంబర్ మూడో వారం లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి తిరిగి షూటింగ్‌లలో జాయినయ్యే అవకాశం ఉందని సమాచారం.
రుక్మిణి వసంత్....
డ్రాగన్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ కపూర్, బిజు మీనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గాయం కారణంగా ఎన్టీఆర్ దూరం అయినా డ్రాగన్ షూటింగ్ మాత్రం ఆగిపోలేదు. అనిల్ కపూర్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ప్రశాంత్ నీల్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 11న థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Short Film | నో లాంగర్ హ్యూమన్ షార్ట్ ఫిల్మ్‌పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసలు
ఆగస్టు 8, 2026

Hero Nani | అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ – ఇప్పుడు ప్రొడ్యూసర్ – నాని, నితిన్ అలియాస్ రుక్మిణి మూవీ ఓపెనింగ్ ఫొటోలు!
ఆగస్టు 3, 2026

Keerthy Suresh | ప్యారడైజ్ కోసం కీర్తి సురేష్ రెండు రోజులు నిద్రకు దూరం – మహానటిపై నెటిజన్ల ప్రశంసలు
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Smart Ration Cards | 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత
- ●Nagadurga | కొమురవెల్లి ఆలయంలో యంగ్ హీరోతో కలిసి నాగదుర్గ పూజలు
- ●Naveen Nicolas | పాఠశాలల భవనాలు పూర్తయ్యేలోపు ఫర్నీచర్ ఉండాలి.. నిధుల సమస్య రాకుండా చూసుకోండి
- ●Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- ●Rukmini Vasanth | క్లాప్‌బోర్డ్‌తో రుక్మిణి వసంత్ - మలయాళంలో తొలి అడుగు
- ●Bollam Mallaiah Yadav | సీఎం వరుణ యాగంతో వర్షాలు బంద్ అయినయ్.. ఎండలు మొదలైనయ్

Smart Ration Cards | 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత

Nagadurga | కొమురవెల్లి ఆలయంలో యంగ్ హీరోతో కలిసి నాగదుర్గ పూజలు

Naveen Nicolas | పాఠశాలల భవనాలు పూర్తయ్యేలోపు ఫర్నీచర్ ఉండాలి.. నిధుల సమస్య రాకుండా చూసుకోండి

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు



