Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ – ఆత్మలతో అంబులెన్స్ డ్రైవర్ ఫ్రెండ్‌షిప్
మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ సుఖమానో సుఖమాను ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. కుంబలంగి నైట్స్ ఫేమ్ మాథ్యూ థామస్ హీరోగా నటించిన ఈ సినిమాలో దేవికా సంజయ్ హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On May 28, 2026, 11.59 am IST
Malayalam OTT | మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ సుఖమానో సుఖమాను థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. మాథ్యూ థామస్, దేవికా సంజయ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అరుణ్ లాల్ రామచంద్రన్ దర్శకత్వం వహించాడు.
అమెజాన్ ప్రైమ్....
వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సుఖమానో సుఖమాను మూవీ రిలీజైంది. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగుందనే టాక్ వచ్చినా కమర్షియల్‌గా మాత్రం ఫెయిలైంది. తాజాగా సుఖమానో సుఖమాను ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మలయాళం మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
అంబులెన్స్ డ్రైవర్ కథ...
థియో ఓ అంబులెన్స్ డ్రైవర్. తన వృత్తి ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేస్తాడు. అనాథ అయిన థియోకు నా అనేవాళ్లు ఎవరూ ఉండరు. శవాలను అంబులెన్స్‌లో తరలిస్తుండటంతో అతడితో మాట్లాడటానికి ఊరివాళ్లు భయపడుతుంటారు. ఒంటరితనంతో బాధపడుతోన్న థియోకు అనుకోకుండా కొన్ని ఆత్మలు పరిచయం అవుతాయి. తన అంబులెన్స్‌లోనే శవాలుగా తరలించిన వారే ఆత్మలుగా మళ్లీ థియోను వెతుక్కుంటూ ఎందుకొచ్చారు? థియోకు వారు ఎలాంటి సాయం చేశారు. థియో లైఫ్‌లోకి వచ్చిన చారు ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
కుంబలంగి నైట్స్...
కుంబలంగి నైట్స్ మూవీతో మలయాళంలో ఫేమస్ అయ్యాడు మాథ్యూ థామస్. అంజమ్ పాథీరా, వన్, క్రిస్టీ, లియో, ఫ్యామిలీతో పాటు పలు మలయాళ, తమిళ సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాడు.
సంబంధిత వార్తలు

OTT | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన నాగశౌర్య డిజాస్టర్ మూవీ
మే 15, 2026

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026

OTT | తండ్రికి ఎదురుతిరిగిన సోనాక్షి – డైరెక్ట్‌గా ఓటీటీలోకి జ్యోతిక బాలీవుడ్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ మూవీ
మే 12, 2026
తాజావార్తలు
- ●BSNL JTO Recruitment | బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలోనూ ఖాళీలు
- ●Ironing Prices | బెంగళూరులో ఇస్త్రీ ధరలు చూసి షాకైన నోయిడా వ్యాపారి
- ●Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి
- ●Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ - విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
- ●YouTube | యూట్యూబ్‌లో వీడియోలకు కొత్త లేబుల్స్.. ఏఐ కంటెంట్ అయితే వెంటనే చెప్పేస్తుంది..
- ●CUET UG | సీయూఈటీ యూజీ రీషెడ్యూల్.. వాయిదా పడిన పరీక్షలు ఈ తేదీల్లో..

BSNL JTO Recruitment | బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలోనూ ఖాళీలు

Ironing Prices | బెంగళూరులో ఇస్త్రీ ధరలు చూసి షాకైన నోయిడా వ్యాపారి

Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి

Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ - విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్



