త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ – తండ్రి బిజినెస్ కొడుకు ప్రేమ‌కు అడ్డొస్తే

సుహాస్ హీరోగా న‌టించిన తెలుగు కామెడీ మూవీ హే బ‌ల్‌వంత్ ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 31 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. శివానీ న‌గ‌రం హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో సీనియ‌ర్ న‌రేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించారు.

N

Entertainment | Published On Mar 27, 2026, 2.34 pm IST

Telugu OTT | ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ – తండ్రి బిజినెస్ కొడుకు ప్రేమ‌కు అడ్డొస్తే
Advertisement

Telugu OTT | సుహాస్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ హే బ‌ల్‌వంత్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ వ‌చ్చేసింది. ఈ కామెడీ సినిమాలో శివానీ న‌గ‌రం హీరోయిన్‌గా న‌టించింది. సీనియ‌ర్ న‌రేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. హే బ‌ల్‌వంత్ మూవీతో గోపీ అచ్చర ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.హే బ‌ల్‌వంత్ ఓటీటీ రిలీజ్‌ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యాయి. మార్చి 31 నుంచి జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.

టైటిల్ ఛేంజ్‌...

ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో థియేట‌ర్ల‌లో రిలీజైన హే బ‌ల్‌వంత్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందు వెరైటీ ప్ర‌మోష‌న్స్ కార‌ణంగా ఈ చిన్న సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. తొలుత ఈ సినిమాకు హే భ‌గ‌వాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ విష‌యంలో సెన్సార్ నుంచి అడ్డంకులు ఎదుర‌య్యాయి. దాంతో హే బ‌ల్‌వంత్‌గా పేరు మార్చి మేక‌ర్స్ ఈ సినిమాను రిలీజ్ చేశారు. టైటిల్ ఛేంజ్ ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌పై ప‌డింది.
దాదాపు ప‌ది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ఎనిమిది కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఓటీటీ, శాటిలైట్ క‌లుపుకొని నిర్మాత‌లు లాభాల్లోకి అడుగుపెట్టిన‌ట్లు టాక్ వినిపించింది.

తండ్రి బిజినెస్‌...

కృష్ణ (సుహాస్‌) ఎమ్‌బీఏ కంప్లీట్ చేస్తాడు. తండ్రి బ‌ల్‌వంత్ బిజినెస్ చేస్తుంటాడు. తాను చేసే వ్యాపారం గురించి కొడుకు ద‌గ్గ‌ర దాస్తాడు బ‌ల్‌వంత్‌. బ‌ల్‌వంత్‌కు హార్ట్‌స్ట్రోక్ రావ‌డంతో తండ్రి వ్యాపార బాధ్య‌త‌ల‌ను తాను చేప‌ట్టాల‌ని కృష్ణ నిర్ణ‌యించుకుంటాడు.
తండ్రి చేసే బిజినెస్ గురించి కృష్ట‌కు ఎలాంటి షాకింగ్ నిజం తెలిసింది? కృష్ణ లైఫ్‌లోకి వ‌చ్చిన మిత్ర (శివానీ న‌గ‌రం) ఎవ‌రు? ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని క‌ల‌లు కంటున్న మిత్ర తండ్రి పీవీబీకి (హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌) బ‌ల్‌వంత్ వ్యాపారం వ‌ల్ల జ‌రిగిన న‌ష్ట‌మేమిటి? అనే అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్కింది.

Advertisement

తాజావార్తలు

Advertisement