త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suhas | ఇలాంటి సినిమా క‌దా చేయాల్సింద‌ని నా భార్య అన్న‌ది – సుహాస్ కామెంట్స్‌

సుహాస్ హీరోగా న‌టించిన హే బ‌ల్‌వంత్ మూవీ ఫిబ్ర‌వ‌రి 20న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. తొలుత ఈ సినిమాకు హే భ‌గ‌వాన్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ సెన్సార్ అభ్యంత‌రం కార‌ణంగా టైటిల్ మార్చారు. ఈ టైటిల్ ఛేంజ్‌పై హీరో సుహాస్ రియాక్ట్ అయ్యాడు.

N

Entertainment | Published On Feb 17, 2026, 8.39 pm IST

Suhas | ఇలాంటి సినిమా క‌దా చేయాల్సింద‌ని నా భార్య అన్న‌ది – సుహాస్ కామెంట్స్‌
Advertisement

Suhas |  సుహాస్ హీరోగా న‌టించిన హే భ‌గ‌వాన్ మూవీ టైటిల్‌ను రిలీజ్ ముంగిట హే బ‌ల్‌వంత్‌గా మార్చారు. కామెడీ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 20న రిలీజ్ కాబోతుంది. ఇందులో శివానీ న‌గ‌రం హీరోయిన్‌గా న‌టించింది. గోపీ అచ్చ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హే బ‌ల్‌వంత్ టైటిల్ ఛేంజ్‌పై సుహాస్ రియాక్ట్ అయ్యారు. సెన్సారు అభ్యంత‌రం వ‌ల్లే సినిమా పేరు మార్చాల్సివ‌చ్చింద‌ని అన్నారు.

భ‌గ‌వంతుడు కాబ‌ట్టే...

భగవాన్‌ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది కాబట్టి టైటిల్‌ మార్చాలని సెన్సారు స‌భ్యులు అన్నారు. చాలా టైటిల్స్ అనుకొని చివ‌ర‌కు హే బల్‌వంత్‌గా పేరు మార్చాం. కొత్త టైటిల్‌ను క‌నెక్ట్ అయ్యేలా సినిమాలో సీనియ‌ర్ న‌రేష్‌ క్యారెక్టర్‌ పేరు మార్చాల్సివ‌చ్చింది.

తండ్రి బిజినెస్‌...

చిన్నప్పటి నుంచి బిజినెస్‌ చేయాలని ఆలోచించే యువ‌కుడిగా ఈ సినిమాలో నేను క‌నిపిస్తా. నాన్న బిజినెస్‌ను టేకప్‌ చేయాలని ఆ యువ‌కుడు క‌ల‌లు కంటుంటాడు. అనుకుంటాడు. ఈ క్ర‌మంలో అతనికి ఎదురైన పరిణామాలు ఏమిటి? తండ్రి చేసే బిజినెస్ గురించి తెలిసి ఏం చేశాడు అన్న‌ది సినిమాలో చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. ప్ర‌తి సినిమా హిట్ట‌వుతుంద‌నే చేస్తాం. రిజ‌ల్ట్ అనుకున్న‌ట్లుగా రాక‌పోతే ఎవ‌రైనా బాధ‌ప‌డ‌తారు. నా గ‌త సినిమాలు అనుకున్నంత‌గా ఆడ‌లేదు. విజ‌యం కోసం ఎదురుచూడ‌టం త‌ప్ప నా చేతుల్లో ఏం లేదు. నెక్స్ట్ సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా మారిపోయి ప‌రాజ‌యం తాలూకు బాధ నుంచి బ‌య‌ట‌ప‌డుతుంటా.

త‌మిళంలోకి విల‌న్‌గా ఎంట్రీ...

మందాడి మూవీతో త‌మిళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నా. ఇందులో మెయిన్‌ విలన్ క‌నిపిస్తా. మందాడిలో నా లుక్‌ అండ్‌ క్యారెక్టర్ డిఫ‌రెంట్‌గా ఉంటాయి. అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు చూసి విల‌న్ పాత్ర‌కోసం మేక‌ర్స్ న‌న్ను అప్రోచ్ అయ్యారు. విల‌న్‌గా నా క్యారెక్ట‌ర్‌ను ఆడియెన్స్ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే టెన్షన్‌ ఉంది.
హే బ‌ల్‌వంత్ సినిమాను నా భార్య చూసి చాలా ఎంజాయ్‌ చేసింది. ఇలాంటి సినిమాలు కదా నువ్వు చేయాల్సింది అని నాతో అన్న‌ది.ప్ర‌స్తుతం కార్తీక్‌ సుబ్బరాజు బ్యానర్‌లో ఓ త‌మిళ‌ సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను,

Advertisement
Advertisement