త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Censor Issues | మ‌రో తెలుగు మూవీకి సెన్సార్ చిక్కులు – రిలీజ్ ముంగిట టైటిల్ ఛేంజ్‌

సుహాస్‌, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా న‌టించిన హే భ‌గ‌వాన్ మూవీ ఫిబ్ర‌వ‌రి 20న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సెన్సార్ అభ్యంత‌రాల‌తో రిలీజ్ ముగింట ఈ సినిమా టైటిల్ మారింది. హే భ‌గ‌వాన్ పేరును...హే బ‌ల్వంత్‌గా మార్చిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Feb 16, 2026, 2.48 pm IST

Censor Issues | మ‌రో తెలుగు మూవీకి సెన్సార్ చిక్కులు – రిలీజ్ ముంగిట టైటిల్ ఛేంజ్‌
Advertisement

Censor Issues |  గ‌త కొన్నాళ్లుగా సెన్సార్ బోర్డు రూల్స్ కార‌ణంగా ప‌లు సినిమాలు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయి. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ సెన్సార్ స‌మ‌స్య‌ల కార‌ణంగానే వాయిదాప‌డింది. సెన్సార్ బోర్డుపై జ‌న‌నాయ‌గ‌న్ మేక‌ర్స్ సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లినా విజ‌యం సాధించ‌లేక‌పోయారు. చివ‌ర‌కు సీబీఎఫ్‌సీ పంత‌మే నెగ్గింది.ఈ సినిమా ఇప్ప‌టికీ రిలీజ్‌కు నోచుకోలేదు. త‌మిళ సినిమాలే కాకుండా తెలుగు సినిమాల‌కు సెన్సార్ నుంచి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఇటీవ‌ల చాయ్‌వాలా మూవీ టైటిల్‌పై సెన్సార్ బోర్డు అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దాంతో మేక‌ర్స్ న‌వాబ్ కేఫ్‌గా పేరు మార్చారు. కపుల్ ఫ్రెండ్లీ మూవీకి ఏ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డంపై నిర్మాత బ‌హిరంగంగానే అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

హే భ‌గ‌వాన్‌...

తాజాగా సెన్సార్ కార‌ణంగా మ‌రో సినిమా టైటిల్ రిలీజ్ ముంగిట మారింది. సుహాస్‌, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా న‌టించిన హే భ‌గ‌వాన్ మూవీ ఫిబ్ర‌వ‌రి 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుద‌ల‌కు మ‌రో నాలుగు రోజులు ఉండ‌గా...ఈ సినిమా టైటిల్‌ను హే బ‌ల్వంత్‌గా మార్చిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. హే భ‌గ‌వాన్ టైటిల్‌పై సెన్సార్ బోర్డు అభ్యంత‌రం తెలిపిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే టైటిల్‌ను మార్చిన‌ట్లు తెలుస్తోంది.

రిజ‌ల్ట్‌పై ఎఫెక్ట్‌...

హే భ‌గ‌వాన్ అనే టైటిల్‌తోనే మేక‌ర్స్ ఇన్నాళ్లుగా ప్ర‌మోష‌న్స్ చేశారు. స‌డెన్‌గా పేరు మార‌డంతో ఆ ఎఫెక్ట్ సినిమా రిజ‌ల్ట్‌పై ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ పేరు మార్పుపై మేక‌ర్స్ రియాక్ష‌న్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
హే బ‌ల్వంత్ మూవీలో సీనియ‌ర్ న‌రేష్, స్ర‌వంతి చొక్కార‌పు, వెన్నెల‌కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గోపీ అచ్చ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను వంశీ నందిపాటి, బ‌న్నీవాసు రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement