త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sudigali Sudheer | ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి సుడిగాలి సుధీర్ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ మూవీ – హీరోయిన్‌గా కోలీవుడ్ బోల్డ్ బ్యూటీ

జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్ హీరోగా న‌టించిన గోట్ మూవీని షూటింగ్ నుంచే అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ద‌ర్శ‌కుడు త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ హీరోయిన్ ఆరోప‌ణ‌లు చేయ‌డం, లీకుల కార‌ణంగా షూటింగ్ మ‌ధ్య‌లోనే డైరెక్ట‌ర్ త‌ప్పుకోవ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. అనేక అడ్డంకుల‌ను దాటుకొని ఎట్ట‌కేల‌కు ఈ రొమాంటిక్ కామెడీ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Oct 1, 2026, 4.53 pm IST

Sudigali Sudheer | ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి సుడిగాలి సుధీర్ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ మూవీ – హీరోయిన్‌గా కోలీవుడ్ బోల్డ్ బ్యూటీ
Advertisement

Sudigali Sudheer | జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్ హీరోగా న‌టించిన గోట్ మూవీ అనేక వివాదాలు, అడ్డంకుల‌ను దాటుకొని ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ గురువారం వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

దివ్య‌భార‌తి హీరోయిన్‌...

రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిన గోట్ మూవీలో సుడిగాలి సుధీర్ స‌ర‌స‌న కోలీవుడ్ బ్యూటీ దివ్య భార‌తి హీరోయిన్‌గా న‌టిస్తోంది. వేద‌వ్యాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గోట్ మూవీ షూటింగ్ నుంచే అనేక వివాదాల‌ను ఎదుర్కొంది. డైరెక్ట‌ర్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారంటూ హీరోయిన్ దివ్య‌భార‌తి ఆరోప‌ణ‌లు చేసింది. నిర్మాత‌ల‌తో ఏర్ప‌డిన విభేదాల‌తో పాటు సినిమాలోని కొన్ని సీన్లు లీక్ కావ‌డంతో డైరెక్ట‌ర్ న‌రేష్ కుప్పిలి గోట్ నుంచి త‌ప్పుకున్నారు. ఈ లీకుల గొడ‌వ పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు వెళ్లింది.

వివాదాల కార‌ణంగా...

ఈ వివాదాల కార‌ణంగా ప్ర‌మోష‌న్స్‌కు సుడిగాలి సుధీర్ దూరంగా ఉన్నారు. చివ‌ర‌కు సినిమాకు డ‌బ్బింగ్ కూడా చెప్ప‌డానికి అత‌డు ఆస‌క్తిని చూప‌లేదు. సుధీర్ తీరుపై నిర్మాత బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు గుప్పించారు. నిర్మాత ఆరోప‌ణ‌ల‌తో దిగొచ్చిన సుధీర్ ప్ర‌మోష‌న్స్‌కు అటెండ్ అయ్యాడు. కానీ సినిమా మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. చాలా సార్లు వాయిదాప‌డింది. ఈ నవంబ‌ర్ 12న అయిన విడుద‌ల అవుతుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

యూత్‌కు మెసేజ్‌...

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు అంత‌ర్లీనంగా యూత్‌కు ఓ మెసేజ్ ఇస్తూ ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు ద‌ర్శ‌కుడు చెప్పారు. సుడిగాలి సుధీర్ కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంద‌ని అన్నారు. సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ర‌సూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.కోలీవుడ్ హీరోయిన్ అయిన దివ్య‌భార‌తి గోట్ మూవీతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. త‌మిళంలో ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌లు చేసింది.

 

 

Advertisement
Advertisement