త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sudigali Sudheer | సుడిగాలి సుధీర్ సినిమాను వీడ‌ని క‌ష్టాలు – మ‌రోసారి పోస్ట్‌పోన్‌

సుడిగాలి సుధీర్ గోట్ మూవీ మ‌రోసారి వాయిదాప‌డింది. మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను టెక్నిక‌ల్ ఇష్యూస్ వ‌ల్ల వాయిదా వేస్తున్న‌ట్లు ఆదివారం మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Mar 22, 2026, 8.17 pm IST

Sudigali Sudheer | సుడిగాలి సుధీర్ సినిమాను వీడ‌ని క‌ష్టాలు – మ‌రోసారి పోస్ట్‌పోన్‌
Advertisement

Sudigali Sudheer |  సుడిగాలి సుధీర్ గోట్ మూవీని కష్టాలు వీడటం లేదు. ఈ సినిమా మ‌రోసారి వాయిదాప‌డింది. దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్‌ను జ‌రుపుకున్న గోట్ మూవీని ఈ నెల 26న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. నిర్మాత‌ల‌కు, హీరోకు ఏర్ప‌డిన వివాదాలు స‌మ‌సిపోవ‌డం, సుడిగాలి సుధీర్ ప్ర‌మోష‌న్స్‌కు అటెండ్ కావ‌డంతో సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. ఈ సారి ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ కావ‌డం ప‌క్కా అని ఆడియెన్స్ భావించారు.

పోస్ట్‌పోన్‌...

కానీ మేక‌ర్స్ పెద్ద షాకిచ్చారు. గోట్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో త‌లెత్తిన కొన్ని సాంకేతిక స‌మ‌స్య‌ల వ‌ల్ల ఈ సినిమాను వాయిదావేస్తున్నామ‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు.ఆడియెన్స్ బెస్ట్ థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను ఇవ్వ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 6న గోట్‌ ట్రైలర్‌ను విడుదల చేస్తామ‌ని, అదే రోజు కొత్త రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

అభ్యంత‌ర‌క‌ర కామెంట్లు...

రెండు, మూడేళ్ల క్రితం గోట్ మూవీ మొద‌లైంది. షూటింగ్ స‌గంలో ఉండ‌గానే ద‌ర్శ‌కుడికి, నిర్మాత‌కు మ‌ధ్య విభేదాలు మొద‌ల‌య్యాయి. దాంతో న‌రేష్ కుప్పిలి ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నారు. ద‌ర్శ‌కుడు త‌న‌పై అభ్యంత‌రక‌ర‌కామెంట్లు చేశాడంటూ హీరోయిన్ దివ్య‌భార‌తి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టింది.
మ‌రోవైపు సుడిగాలి సుధీర్ ప్ర‌మోష‌న్స్‌కు హాజ‌రుకాక‌పోవ‌డంతో అత‌డిపై నిర్మాత విమ‌ర్శ‌లు గుప్పించారు. డ‌బ్బింగ్ చెప్ప‌డానికి కూడా రావ‌డం లేదంటూ కామెంట్స్ చేశారు. చివ‌ర‌కు ఈ వివాదం సెటిలైంది. ప్ర‌మోష‌న్స్‌కు సుధీర్ అటెండ్ అయ్యారు. స‌మ‌స్య‌ల‌న్ని కొలిక్కి వ‌చ్చి సినిమా రిలీజ్ అవుతుంద‌ని అనుకునేలోపే మ‌రోసారి గోట్ పోస్ట్‌పోన్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
గోట్ మూవీలో దివ్య‌భార‌తి హీరోయిన్‌గా న‌టించింది. బ్ర‌హ్మాజీ, నితిన్ ప్ర‌స‌న్న కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.గోట్ కంటే ముందు గాలోడు, సాఫ్ట్‌వేర్ సుధీర్‌, కాలింగ్ స‌హ‌స్ర‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement