త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series | బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్ల‌తో మ‌హేష్‌బాబు బావ తెలుగు వెబ్‌సిరీస్ – టైటిల్ ఇదే

మ‌హేష్‌బాబు బావ‌, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సిరీస్ టైటిల్ క‌న్ఫామ్ అయ్యింది.

N

Entertainment | Published On Mar 19, 2026, 2.39 pm IST

Web Series | బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్ల‌తో మ‌హేష్‌బాబు బావ తెలుగు వెబ్‌సిరీస్ – టైటిల్ ఇదే
Advertisement

Web Series | మ‌హేష్‌బాబు బావ‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ మూవీతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న సుధీర్‌బాబు ఆ త‌ర్వాత హీరోగా తెలుగులో చాలానే సినిమాలు చేశాడు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌ను ఎంచుకుంటూ సుధీర్‌బాబు చేసిన ఈ సినిమాలేవి స‌రైన‌ విజ‌యాల‌ను అందుకోలేక‌పోయాయి.
గ‌త ఏడాది జ‌ఠాధ‌ర పేరుతో బైలింగ్వ‌ల్ మూవీలో న‌టించాడు సుధీర్‌బాబు. భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన ఈ మూవీ కూడా డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ఓటీటీలోకి....

ఈ ఫ్లాప్‌ల‌తో కెరీర్‌కు ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న సుధీర్‌బాబు తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఓ తెలుగు వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. గ‌ల్లీ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా సాగుతోంది. ఆర్కా మీడియా బ్యాన‌ర్ ప‌తాకంపై బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్లు ప్ర‌సాద్ దేవినేని, శోభుయార్ల‌గ‌డ్డ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు.

గుంటూరు టాకీస్ డైరెక్ట‌ర్‌...

గ‌ల్లీ వెబ్‌సిరీస్‌కు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగులో గుంటూరు టాకీస్‌, గ‌రుడ‌వేగ‌, చంద‌మామ క‌థ‌లు లాంటి వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు ప్రవీణ్ స‌త్తారు. కొంత గ్యాప్ త‌ర్వాత గ‌ల్లీ వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

అమెజాన్ ప్రైమ్‌....

గ‌ల్లీ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇట్స్ స్టార్ట్ హియ‌ర్ పేరుతో ముంబైలో అమెజాన్ ప్రైమ్ గురువారం ఓ భారీ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ది. ఈ ఈవెంట్‌లో గ‌ల్లీ వెబ్‌సిరీస్ డీటెయిల్స్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement