Krithi Shetty | ఓటీటీలోకి కృతి శెట్టి రొమాంటిక్ కామెడీ మూవీ – ఐదు భాషల్లో రిలీజ్
లేటెస్ట్ తమిళ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ దాటేసింది కృతి శెట్టి. సైంటిఫిక్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Entertainment | Published On May 1, 2026, 3.35 pm IST
Krithi Shetty | కృతిశెట్టి కమర్షియల్ హిట్టు అందుకొని నాలుగేళ్లు దాటిపోయింది. గ్లామర్, యాక్టింగ్ పరంగా టాలెంట్ ఉన్న అదృష్టం మాత్రం ఈ అమ్మడికి కలిసిరావడం లేదు. ఉప్పెన మూవీతో తొలి అడుగులోనే బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయాలతో టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కృతిశెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి.
డబుల్ హ్యాట్రిక్...
బంగార్రాజు తర్వాత తెలుగు, తమిళంతో పాటు మలయాళంలో కలిపి ఎనిమిది సినిమాలు చేస్తే ఏఆర్ఎమ్ మినహా మిగిలవన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. ప్లాఫుల్లో డబుల్ హ్యాట్రిక్ అందుకుంది.
లేటేస్ట్ కోలీవుడ్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఈ ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో ఒకటిగా చేరింది. సైంటిఫిక్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ తమిళ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార నిర్మించింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో...
ఏప్రిల్ సెకండ్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్‌పై శుక్రవారం అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎల్ఐకే మూవీ రిలీజ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతోన్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది.
నయనతారకు నష్టాలు...
దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీని నయనతార నిర్మించింది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో 70 కోట్ల వసూళ్లతో ఈ సినిమా డిసపాయింట్ చేసింది. నిర్మాతగా నయనతారకు ఇరవై కోట్లకుపైనే నష్టాలను మిగిల్చింది. థియేటర్లలో తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. తెలుగు వెర్షన్ కనీసం ప్రమోషన్ ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.
లవ్ బ్రేకప్‌ను ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాను రూపొందించారు. కాన్సెప్ట్ బాగున్నా ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడం, లవ్ స్టోరీ కొత్తదనం లేకపోవడంతో ఎల్ఐకే మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత – కమ్‌బ్యాక్ అప్పుడేనా?
నవంబర్ 28, 2026

Rajinikanth | రజనీకాంత్ వర్సెస్ మహేష్‌బాబు – మూడోసారి బాక్సాఫీస్ క్లాష్ – “ధర్మన్” రిలీజ్ డేట్ ఇదే!
నవంబర్ 27, 2026

Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్టర్‌తో బ్రేకప్ – పుకార్లకు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగర్
నవంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



