Hansika | గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హన్సిక – డీ గ్లామర్ లుక్‌లో కోలీవుడ్ బ్యూటీ
గుర్తుపట్టలేనంతగా మారిపోయింది హన్సిక. ఓ హారర్ సినిమాలో డీ గ్లామర్ లుక్‌లో కనిపించబోతుంది. విడాకుల తర్వాత ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న ఆ సినిమా ఏదంటే?
Entertainment | Published On Oct 21, 2026, 3.45 pm IST
Hansika | ఈ ఏడాదే భర్త నుంచి విడాకులు తీసుకుంది హన్సిక. ముంబైకి చెందిన బిజినెస్‌మెన్ సోహైల్ ఖతురియాను ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ మనస్పర్థలతో నాలుగేళ్లలోనే వైవాహిక బంధానికి ముగింపు పలికింది. విడాకుల బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఈ కోలీవుడ్ బ్యూటీ తిరిగి యాక్టింగ్ కెరీర్‌పై దృష్టిసారిస్తోంది.
డీ గ్లామర్ లుక్...
తాజాగా ఓ డీ గ్లామర్ రోల్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది హన్సిక. ఈ గ్లామర్ బ్యూటీ హీరోయిన్‌గా గాంధారి పేరుతో ఓ బైలింగ్వల్ హారర్ మూవీని చాలా రోజుల క్రితం అనౌన్స్‌చేశారు. షూటింగ్ పూర్తయిన ఆర్థిక పరమైన సమస్యల కారణాల రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం. త్వరలోనే ఈ హారర్ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.
టైటిల్ ఛేంజ్...
ఆడియెన్స్‌లో ఈ సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తించేందుకు టైటిల్‌ను మార్చేశారు మేకర్స్. గాంధారి కాకుండా యక్షిణి అనే పేరుతో ఈ బైలింగ్వల్ మూవీ విడుదల కాబోతుంది. హన్సిక కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో డీ గ్లామర్ లుక్‌లో ఈ కోలీవుడ్ బ్యూటీ కనిపిస్తోంది. గుర్తుపట్టలేనంతగా చాలా డిఫరెంట్‌గా ఈ పోస్టర్‌లో ఆమె లుక్ ఉంది.
ఆర్కియాలజిస్ట్...
యక్షిణి మూవీలో హన్సిక ఆర్కియాలజిస్ట్ రోల్‌లో కనిపించబోతుంది. పురాతన కాలానికి చెందిన గంధర్వ కోట మిస్టరీని ఛేందించేందుకు వచ్చిన ఆర్కియాలజిస్ట్‌కు అక్కడ ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? ఆ కోటలో ఉన్న ఆత్మకు ఆర్కియాలజిస్ట్‌కు ఉన్న సంబంధమేమిటన్నదే ఈ సినిమా కథ. ఆర్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెట్రో శిరీష్, తలైవాసల్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వెబ్ సిరీస్....
ఈ ఏడాదే హన్సిక ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. గల్లీ పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈసిరీస్‌కు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. జేడీ చక్రవర్తి, శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్‌ను బాహుబలి నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Naga Chaitanya | రిలీజ్ డేట్ చెప్పేశారు – షూటింగ్ మాత్రం పెండింగ్ – నాగచైతన్య వృషకర్మపై అప్డేట్
అక్టోబర్ 21, 2026

Yellamma Movie | ప్రభాస్ ‘స్పిరిట్’ ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’
అక్టోబర్ 20, 2026

Telangana | తెలంగాణ కథతో మంచు మనోజ్ మైథాలజీ మూవీ – డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ శిష్యుడు
అక్టోబర్ 20, 2026
తాజావార్తలు
- ●MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం..
- ●PPF Interest Rate | పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం.. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా?
- ●Niranjan Reddy | మంత్రి జూపల్లి సవాల్‌కు నిరంజన్ రెడ్డి సిద్దం
- ●Supreme Court | ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
- ●Lava Aura Curve 5G | లావా ఆరా కర్వ్ 5జి వచ్చేసింది.. ధర రూ.23,999..
- ●Mallikarjun Kharge on Manipur | మళ్లీ రక్తమోడుతున్న మణిపూర్: బీజేపీ అసమర్థత వల్లే ఈ దుస్థితి.. మోదీ, అమిత్ షాలకు ఖర్గే 3 ప్రశ్నలు

MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం..

PPF Interest Rate | పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం.. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా?

Niranjan Reddy | మంత్రి జూపల్లి సవాల్‌కు నిరంజన్ రెడ్డి సిద్దం

Supreme Court | ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు



