Fauji | వివాదంలో ప్రభాస్ ఫౌజీ – క్షమాపణ చెప్పాలని సుభాష్ చంద్రబోస్ మునిమనవడు డిమాండ్
ప్రభాస్ ఫౌజీ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్‌పై సుభాష్ చంద్రబోస్ మునిమనవడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాడిన నేతాజీ వ్యక్తిత్వాన్ని, ఆయన స్థాయిని తగ్గించేలా ఈ గ్లింప్స్ ఉందంటూ ఆరోపించారు. చారిత్రక సత్యాలను వక్రీకరిస్తూ సినిమాను తెరకెక్కిస్తున్న హను రాఘవపూడి క్షమాపణలు చెప్పాలని అన్నారు.
Entertainment | Published On Oct 26, 2026, 2.59 pm IST
Fauji | ప్రభాస్(Prabhas) ఫౌజీ మూవీ చిక్కుల్లో పడింది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్‌పై సుభాష్ చంద్రబోస్ మునిమనవడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. చారిత్రక సత్యాలను వక్రీకరించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆరోపించారు.
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా...
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఫౌజీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో రహస్య గూఢచారిగా ప్రభాస్ పనిచేసినట్లు చూపించారు. 1942లో బెర్లిన్‌లో హిట్లర్, సుభాష్ చంద్రబోస్ మధ్య మీటింగ్‌తోనే ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. ఆ తర్వాత బ్రిటీషర్లకు వ్యతిరేకంగా గూఢచారి చేపట్టిన సీక్రెట్ మిషన్, భగవద్గీత ఆధారంగా సృష్టించిన కోడ్ గురించి వివరిస్తూ ప్రభాస్ పాత్రకు నేతాజీ ఇచ్చిన ఎలివేషన్లు ఈ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచాయి. చివరలో సైనికుడి లుక్‌లో పెద్ద గన్‌తో ప్రభాస్ గ్లింప్స్‌లో కనిపించారు.
రికార్డ్ వ్యూస్...
ప్రభాస్ అభిమానులను ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. రికార్డ్ వ్యూస్‌ను రాబట్టింది. కాగా ఈ గ్లింప్స్‌పై సుభాష్ చంద్రబోస్ ముని మనవడు చంద్రకుమార్ బోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫౌజీ గ్లింప్స్‌లో నేతాజీ వ్యక్తిత్వాన్ని ఆయన స్థాయిని తక్కువ చేసి చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్యపరమైన ప్రయోజాల కోసం దేశం కోసం పోరాడిన వీరులను తప్పుగా చూపించడం నేరంతో సమానమని అన్నారు. ఫిక్షన్ పేరుతో చారిత్రక సత్యాలను వక్రీకరించి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న హను రాఘవపూడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రకుమార్ బోస్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆయన వీడియో వైరల్ అవుతోంది.
ఇమాన్వీ...
ఫౌజీ మూవీకి హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 19న థియేటర్లలోకి రాబోతుంది. ఫౌజీలో
మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సుభోద్ భవేతో పాటు వివిధ భాషలకు చెందిన యాక్టర్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tirupathi | డిసెంబర్ 4 -6 తేదీల్లో తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల సమావేశం
- ●JEE aspirant | కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి సూసైడ్
- ●Jio Platforms IPO | జియో, పారస్ హెల్త్‌కేర్ ఐపీఓ అలాట్మెంట్ నేడే.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
- ●BRS Leaders | ప్రైవేట్ వెబ్సైట్లో గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేస్తున్నారు.. ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
- ●Wedding | ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ సీనియర్ హీరో కూతురు - వెడ్డింగ్ ఫొటోలు వైరల్
- ●Actor Dhanush | వెండి దీపాలపై కమలం గుర్తు.. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వెనుక బీజేపీ మద్దతు..?

Tirupathi | డిసెంబర్ 4 -6 తేదీల్లో తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల సమావేశం

JEE aspirant | కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి సూసైడ్

Jio Platforms IPO | జియో, పారస్ హెల్త్‌కేర్ ఐపీఓ అలాట్మెంట్ నేడే.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..

BRS Leaders | ప్రైవేట్ వెబ్సైట్లో గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేస్తున్నారు.. ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు






