త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirupathi | డిసెంబ‌ర్ 4 -6 తేదీల్లో తిరుప‌తిలో డీజీపీలు, ఐజీపీల స‌మావేశం

Tirupathi | డిసెంబ‌ర్ 4వ తేదీ నుంచి 6 వ‌ర‌కు తిరుప‌తి( Tirupathi )లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ ట్రైనింగ్ (IISER) సెంట‌ర్‌లో డీజీపీలు, ఐజీపీల స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

S

National | Published On Oct 26, 2026, 3.00 pm IST

Tirupathi | డిసెంబ‌ర్ 4 -6 తేదీల్లో తిరుప‌తిలో డీజీపీలు, ఐజీపీల స‌మావేశం
Advertisement

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజ‌రు

Tirupathi | త్రినేత్ర న్యూస్ : డిసెంబ‌ర్ 4వ తేదీ నుంచి 6 వ‌ర‌కు తిరుప‌తి( Tirupathi )లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ ట్రైనింగ్ (IISER) సెంట‌ర్‌లో డీజీపీలు, ఐజీపీల స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు త‌దిత‌రులు హాజ‌రు కానున్నారు.

ఈ స‌మావేశాల నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి సాయి ప్ర‌సాద్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. డీజీపీలు, ఐజీపీల స‌మావేశానికి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాటు చేయాల‌ని సంబంధిత శాఖల అధికారుల‌ను సీఎస్ ఆదేశించారు. శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈసమావేశంలో అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి,హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు, కమీషనర్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు, ఎస్ఐబి డిప్యూటీ డైరెక్టర్ అంబిక, ఐపిఎస్ అధికారి కాంతి రాణా తాతా తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే వర్చువల్‌గా టీఆర్ అండ్ బీ కార్యదర్శి కె.శశిధర్, తిరుపతి కలెక్టర్ డా.వెంకటేశ్వర్, ఎస్పీ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement