త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kannada Director | ర‌ష్మిక‌తో ఏడ‌డుగులు వేసిన క‌న్న‌డ డైరెక్ట‌ర్ – పెళ్లి ఫొటోలు వైర‌ల్‌…

సు ఫ్ర‌మ్ సో మూవీ ఫేమ్‌, క‌న్న‌డ ద‌ర్శ‌కుడు జేపీ తుమినాడ్ పెళ్లిచేసుక‌న్నారు. ప్రియురాలు ర‌ష్మిక మెడ‌లో మూడుముళ్లు వేశారు. వీరి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On May 7, 2026, 12.33 pm IST

Kannada Director | ర‌ష్మిక‌తో ఏడ‌డుగులు వేసిన క‌న్న‌డ డైరెక్ట‌ర్ – పెళ్లి ఫొటోలు వైర‌ల్‌…
Advertisement

Kannada Director | గ‌త ఏడాది క‌న్న‌డంలో చిన్న సినిమాగా రిలీజై సంచల‌న విజ‌యాన్ని సాధించింది సు ఫ్ర‌మ్ సో మూవీ. కేవ‌లం ఐదున్న‌ర కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 125 కోట్ల వ‌సూళ్ల‌తో ట్రెండ్‌సెట్ట‌ర్‌గా నిలిచింది. గ‌త ఏడాది క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. సు ఫ్ర‌మ్ సో మూవీతో ద‌ర్శ‌కుడిగా క‌న్న‌డ‌నాట జేపీ తుమినాడ్ పేరు మారుమోగింది. సు ఫ్ర‌మ్ సో సినిమాతో డైరెక్ట‌ర్‌గానే కాకుండా యాక్ట‌ర్‌గా కూడా క‌న్న‌డ‌ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు జేపీ తుమినాడ్‌.

ర‌ష్మిక‌తో పెళ్లి....

తాజాగా ఈ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు పెళ్లిపీట‌లెక్కాడు. ప్రియురాలు ర‌ష్మిక‌తో తుమినాడ్ వివాహం బుధ‌వారం జ‌రిగింది. మంగుళూరులో తుమినాడ్‌, ర‌ష్మిక పెళ్లి వేడుక‌ గ్రాండ్‌గా జ‌రిగింది. వీరి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

14 ఏళ్ల ప్రేమాయ‌ణం...

ర‌ష్మిక‌తో తుమినాడ్ ప‌ధ్నాలుగు ఏళ్లుగా ప్రేమ‌లో ఉన్నార‌ట‌. సినిమాల్లోకి రాక‌ముందు థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా, డైరెక్ట‌ర్‌గా కొన‌సాగారు తుమినాడ్‌. తుళు భాష‌లో ఫేమ‌స్ థియేట‌ర్ ఆర్టిస్ట్‌ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు. నాట‌కాలు వేసే టైమ్‌లోనే ర‌ష్మిక‌తో తుమినాడ్‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ట‌. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాతే ఈ జంట పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. సు ఫ్ర‌మ్ సోతో త‌న క‌ల‌ను నెర‌వేర్చుకున్న తుమినాడ్‌...బుధ‌వారం ప్రియురాలితో ఏడ‌డుగులు వేశాడు.

రాజ్ బీ శెట్టి....

హార‌ర్ కామెడీగా తెర‌కెక్కిన సు ఫ్ర‌మ్ సో సినిమాకు క‌న్న‌డ అగ్ర న‌టుడు రాజ్ బీ శెట్టి ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇందులో గెస్ట్ రోల్‌లో రాజ్ బీ శెట్టి క‌నిపించారు. షానీల్ గౌత‌మ్‌, సంధ్య ఆర్కారే, జేపీ తుమినాడ్‌, ప్ర‌కాష్ తుమినాడ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

 

Advertisement
Advertisement