Kannada Producer | కన్నడ అగ్ర నిర్మాత సిల్క్‌మంజు కన్నుమూత – సినిమాలు తీసి – అప్పుల పాలై…
కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఉపేంద్రతో ఏ సినిమాను నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ బీజీ మంజునాథ్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఒకప్పుడు స్టార్ హీరోలకు ఎన్నో హిట్స్ ఇచ్చిన ఆయన చివరి రోజుల్లో సినిమా తీసి అప్పుల పాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యం బారిన పడి తుది శ్వాస విడిచారు.
Entertainment | Published On Oct 27, 2026, 7.58 pm IST
Kannada Producer | కన్నడ నిర్మాత బీజీ మంజునాథ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఉపేంద్ర ఏ సినిమాతో బీజీ మంజునాథ్ నిర్మాతగా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉపేంద్ర దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ అప్పట్లోనే 20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
బీజీ మంజునాథ్...
తెలుగులోకి అదే పేరుతో డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ప్రత్యర్థ, అగ్రహార, సూర్యకాంతి, ఆర్భాటతో పాటు యాభైకిపైగా సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఒకప్పుడు కన్నడంలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు బీజీ మంజునాథ్. టెక్స్‌టైల్ బిజినెస్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బీజీ మంజునాథ్.... సిల్క్ మంజుగా ఫేమస్ అయ్యారు.
తాకట్టు పెట్టి...
కన్నడంలో ఒకప్పుడు స్టార్ హీరోలకు ఎన్నో హిట్స్ ఇచ్చిన సిల్క్ మంజు కెరీర్ చివరలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పులు చేసి, ఇల్లు తాకట్టు పెట్టి ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో టెర్రర్ అనే సినిమాను నిర్మించారు. ఈ ఏడాదే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సిల్క్ మంజును మంచేసింది. పెట్టిన బడ్జెట్‌లో పావు వంతు కూడా రాబట్టలేకపోయింది. ఈ ఫెయిల్యూర్‌తో ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరకు తన సొంత కుటుంబసభ్యులను గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Oil Palm Cultivation | 6వ తరం హైబ్రిడ్ ఆయిల్‌పామ్ విత్తనాల ఉత్పత్తి కోసం దేశంలోనే తొలి సీడ్ గార్డెన్ ఖమ్మంలో
- ●HYD Police | శాంతిభద్రతలు, దర్యాప్తు విభజనకు శ్రీకారం
- ●KTR | రైతుబంధు ఇయ్యకుండా రాహుల్ బంధు కడుతుండు
- ●Husharu 2 | "హుషారు 2"లో ఆర్ నారాయణమూర్తి - మంచి పాత్రలు వస్తే నటిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్
- ●Telangana BJP | NEXT తెలంగాణ షురూ.. కార్యాచరణ మొదలు పెట్టిన బీజేపీ
- ●Global Summit 2026 | ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్.. 550కి పైగా దిగ్గజ సంస్థలకు ఆహ్వానం

Telangana Oil Palm Cultivation | 6వ తరం హైబ్రిడ్ ఆయిల్‌పామ్ విత్తనాల ఉత్పత్తి కోసం దేశంలోనే తొలి సీడ్ గార్డెన్ ఖమ్మంలో

HYD Police | శాంతిభద్రతలు, దర్యాప్తు విభజనకు శ్రీకారం

KTR | రైతుబంధు ఇయ్యకుండా రాహుల్ బంధు కడుతుండు

Husharu 2 | "హుషారు 2"లో ఆర్ నారాయణమూర్తి - మంచి పాత్రలు వస్తే నటిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్






