త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Spirit Movie | ప్రభాస్ స్పిరిట్‌పై నెగెటివ్ క్యాంపెయిన్ – ఆ హీరోయిన్ కార‌ణ‌మంటున్న ఫ్యాన్స్

ప్ర‌భాస్ స్పిరిట్ నుంచి ప్ర‌కాష్ రాజ్ త‌ప్పుకున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌కాష్ రాజ్ స్వ‌యంగా ఈ రూమ‌ర్ల‌ను ఖండించారు. కాగా స్పిరిట్‌పై జ‌రుగుతోన్న ఈ నెగెటివ్ క్యాంపెయిన్ వెనుక ఓ హీరోయిన్ ఉందంటూ ప్ర‌భాస్ అభిమానులు చెబుతోన్నారు.

N

Entertainment | Published On Feb 9, 2026, 5.59 pm IST

Spirit Movie | ప్రభాస్ స్పిరిట్‌పై నెగెటివ్ క్యాంపెయిన్  – ఆ హీరోయిన్ కార‌ణ‌మంటున్న ఫ్యాన్స్
Advertisement

Spirit Movie |  ప్రభాస్ స్పిరిట్ మూవీ నుంచి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సందీప్ వంగాతో మొద‌లైన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ప్ర‌కాష్ రాజ్ ఈ సినిమా నుంచి వైదొలిగిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ట్వీట్‌లు, పోస్ట్‌లు క‌నిపిస్తున్నాయి. చివ‌ర‌కు ఈ రూమ‌ర్ల‌పై ప్ర‌కాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాలో త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ ఇంకా మొద‌లుకాలేద‌ని, అలాంట‌ప్పుడు క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ ఎక్క‌డి నుంచి వ‌స్తాయంటూ ట్వీట్ పెట్టారు. ప్ర‌కాష్ రాజ్ ట్వీట్‌తో ఈ రూమ‌ర్ల‌కు పుల్‌స్టాప్ ప‌డింది.

మొద‌టిసారి కాదు....

స్పిరిట్‌పై ఇలాంటి నెగెటివ్ రూమ‌ర్లు రావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలో ప్ర‌భాస్‌, సందీప్ వంగా మ‌ధ్య కూడా గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని వార్త‌లొచ్చాయి. షూటింగ్ ఆగిపోయింద‌ని, ఫ‌స్ట్ షెడ్యూల్ ర‌షెస్ విష‌యంలో ప్ర‌భాస్ అసంతృప్తిని వ్య‌క్తం చేశారంటూ కూడా అబ‌ద్ద‌పు క‌థ‌నాలు ప్ర‌చార‌మ‌య్యాయి.
ఇవే కాకుండా ఈ సినిమాలో ప్ర‌భాస్ తండ్రిగా చిరంజీవి న‌టిస్తున్నాడంటూ అప్ప‌ట్లో ఓ రూమ‌ర్ గ‌ట్టిగా వినిపించింది. చివ‌ర‌కు మెగాస్టార్ స్వ‌యంగా తాను ఈ సినిమా చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. ఇలా త‌ర‌చుగా స్పిరిట్‌పై ఏదో ఒక నెగెటివ్ రూమ‌ర్ వినిపిస్తూనే ఉంది.

ఫేక్ రూమ‌ర్లు...

తాజాగా ప్ర‌కాష్ రాజ్ స్పిరిట్‌ నుంచి త‌ప్పుకున్నాడ‌న్న రూమ‌ర్ వైర‌ల్ కావ‌డంతో చాలా మంది ఇది నిజ‌మేన‌ని అనుకున్నారు. ప్ర‌కాష్ రాజ్ స్వ‌యంగా ఈ పుకార్ల‌కు పుల్‌స్టాప్ పెట్టారు. స్పిరిట్‌పై కావాల‌నే ఈ నెగెటివ్ క్యాంపెయిన్ జ‌రుగుతుంద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇలాంటి ఫేక్ రూమ‌ర్ల‌ను క్రియేట్ చేసి సినిమానుపై ఉన్న బ‌జ్‌ను పోగొట్టాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు.

దీపికా ప‌దుకొనే టీమ్‌...

ఈ ఫేక్ రూమ‌ర్ల వెనుక దీపికా ప‌దుకొనే పీఆర్ టీమ్ ఉంద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ అంటున్నారు. తొలుత ఈ సినిమాలో దీపికా ప‌దుకొనేను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకున్నారు డైరెక్ట‌ర్ సందీప్ వంగా. ఎనిమిది గంట‌ల రూల్‌తో పాటు రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో దీపికా పెట్టిన కండీష‌న్ల వ‌ల్ల సందీప్ వంగా హ‌ర్ట‌య్యారు. ఆమెను కాద‌ని త్రిప్తి డిమ్రిని సెలెక్ట్ చేశారు.
దాంతో త‌న పీఆర్ టీమ్‌తో క‌లిసి దీపికా ప‌దుకొనే స్పిరిట్‌పై నెగెటివ్ ప్ర‌చారం చేయిస్తున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తోన్నాయి. స్పిరిట్‌ స్టోరీని కూడా లీక్ చేసిన‌ట్లు స‌మాచారం. వ‌య‌లెన్స్‌, బోల్డ్ సీన్లు చాలా ఉన్నాయంటూ అబ‌ద్ధ‌పు క‌థ‌నాల్ని వ్యాప్తి చేసి త్రిప్తి డిమ్రిని కూడా ఈ సినిమా నుంచి త‌ప్పించాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ట్లు బాలీవుడ్‌లో టాక్ వినిపించింది. గ‌తంలో డ‌ర్టీ పీఆర్ గేమ్స్‌...ఇదేనా మీ ఫెమినిజం అంటూ వేర్వేరు సంద‌ర్భాల్లో సందీప్ రెడ్డి చేసిన ట్వీట్స్ హిందీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. దీపికా ప‌దుకొనేను ఉద్దేశించే సందీప్ వంగా ఈ పోస్ట్‌లు పెట్టిన‌ట్లు పేర్కొన్నారు. తాజాగా ప్ర‌కాష్ రాజ్ రూమ‌ర్ కూడా ఆ హీరోయిన్ పీఆర్ టీమ్ క్రియేట్ చేసింద‌ని ప్ర‌భాస్ అభిమానులు చెబుతోన్నారు. దీపికా ప‌దుకొనే పేరు చెప్ప‌కుండా వారు చేస్తోన్న ట్వీట్స్‌, పోస్ట్‌లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement
Advertisement